Revanth Reddy | KCR | KCR | Telangana | ACB | Corruption

Revanthe reddy trapped in the telangana cm kcr

Revanth Reddy, KCR, KCR, Telangana, ACB, Corruption

Revanthe reddy trapped in the telangana cm kcr. Telangana cm KCR likely to planed for Revanth reddy from past two months.

కేసీఆర్ పద్మవ్యూహంలో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి

Posted: 06/01/2015 08:23 AM IST
Revanthe reddy trapped in the telangana cm kcr

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద దాడులకు దిగే వారిలో మొదటిపేరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిది. గత అసెంబ్లీ సమావేశాల్లో బహిష్కరణకు గురైన నాటి నుండి కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి ఢీ అంటే ఢీ అన్నట్లు సాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ మంత్రులు కూడా ముందు నుండి సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలను బట్టబయలు చేస్తామని అంటున్నా.. కనీసం క్యాచ్ చెయ్యలేదు రేవంత్ రెడ్డి అంటున్నారు కొంత మంది తెలంగాణ టిడిపి నాయకులు. గత కొంత కాలంగా కేసీఆర్ వేసిన పద్మవ్యూహంలో సగం తెలిసిన అభిమన్యుడిలా దొరికిపోయారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ నుంచి టీడీపీ నేతలకు కొన్ని సంకేతాలు అందాయి. టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష్‌’ నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న టీటీడీపీ నేతలు ఆయనను సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ, రేవంత్‌ రెడ్డి వస్తేనే తాను మాట్లాడతానంటూ, మరెవరితోనూ మాట్లాడబోనని స్టీఫెన్‌ స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఈ తర్జనభర్జనలు సాగాయి. చివరికి స్టీఫెన్‌ను కలవాలనే రేవంత్‌ నిర్ణయించుకున్నారు. అయితే, ఏదైనా హోటల్‌లో కానీ ఫార్మ్‌ హౌస్‌లో కానీ భేటీ కాకుండా నేరుగా స్టీఫెన్‌ ఇంట్లోనే ఆయన్ను కలిసే సాహసం చేశారు. పక్కా ప్రణాళికతో ఇంటినిండా నిఘా కెమెరాలతో సిద్ధంగా ఉన్న స్టీఫెన్‌ పక్కా ఆధారాలతో రేవంత్‌ను బిగించేశారు. కేసీఆర్‌ విసిరిన ఎరకు రేవంత్‌ చిక్కుకుపోయారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎగిసి ఎగిసి పడుతున్న రేవంత్ రెడ్డి కి పగ్గాలు పడ్డాయని.. కేసీఆర్ ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయిందని అంటున్నారు కేసీఆర్ అభిమానులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  KCR  KCR  Telangana  ACB  Corruption  

Other Articles