Large quantity of adulterated fuel seized during minister's raid at petrol pump in Khargone

Mp minister petrol pump 72 000 litre kerosene

MP minister, petrol pump, 72, 000 litre kerosene, adulteration of fuel, Kunwar Vijay Shah, petrol pump raided in Khargone, MP department of food and civil supplies, Essential Commodities Act, Madhya Pradesh, Vijay Shah, Pterol pump, Kerosene, Below Poverty Line, Madhya Pradesh, MP minister raids petrol pump, seizes 72,000 litre kerosene, Khargone(MP), Khargone(MP) news

Madhya Pradesh Food and Civil Supplies Minister Vijay Shah today conducted a surprise check at a petrol refilling station in the Sanawad area here and seized 72,000 litres of white kerosene, allegedly used to adulterate the fuel.

కల్తీ మాల్: పెట్రోల్ బంకులో వేల లీటర్ల కిరోసిన్..

Posted: 05/30/2015 04:28 PM IST
Mp minister petrol pump 72 000 litre kerosene

కింద దగా, పూన దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీ శ్రీ వ్యాఖ్యలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం వారు. అందుకేనేమో.. ఏకంగా 72 వేల లీటర్ల కిరోసిన్ ను సిద్దం చేశారు. వాటిలో కోండ పెట్రోల్, డిజిల్ లో కలపనుండగా, మరికోంత కల్తీ చేసి దారిద్ర్య రేఖకు దిగువన వున్న పేదలకు విక్రయించేందుకు సిద్దం చేశారు. అయితే ఈ విషయమై పిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి కున్వారా విజయ్ షా, తనిఖీ బృందాలతో దాడులు నిర్వహించి దాదాపు 72 వేల లీటర్ల కిరోసిన్ పట్టుకున్నారు.

ఆ బంక్ యాజమాన్యానే కాదు మొత్తం జిల్లా పౌర సరఫరా అధికార యంత్రంగాన్నూ అవాక్కయ్యేలా చేశారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ షాకు గత కొంతకాలంగా పెట్రోల్ బంక్ వారు డీజిల్, పెట్రోల్లో బాగా కల్తీ చేస్తున్నారని, కిరోసిన్ కలుపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పనిగట్టుకొని రంగంలోకి దిగిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా సదరు పెట్రోల్ బంక్ పై అధికారుల బృందంతో ఆకస్మికంగా తనీఖీ చేసి షాక్ ఇచ్చారు. అక్కడే నెంబర్ ప్లేట్స్ లేని ఓ కంటెయినర్ మరో పెట్రోల్ ట్యాంకర్లను గుర్తించారు. పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఈ కిరోసిన నిల్వచేసి ఉంచినట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో 40 వేల లీటర్లు బ్లూ కిరోసిన్, 32 వేల లీటర్లు తెల్ల కిరోసిన్ గుర్తించినట్లు తెలిపారు.
ఈ కిరోసిన్ ను చౌక ధరల దుకాణాలలో లభించే నీలిరంగు కిరోసిన్ ను రంగుమార్చి మార్కెట్లలో విక్రయానికి వుంచినట్లు మంత్రి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP minister  Madhya Pradesh  Vijay Shah  Pterol pump  Kerosene  72  000 litre kerosene  

Other Articles