Madarasa | Muslims | gays | vassem Raja | Aligarh

A alighad muslim university professonr said that there is gays in the madarasas

Madarasa, Muslims, gays, vassem Raja, Aligarh

A alighad muslim university professonr said that there is gays in the Madarasas. History professor Vaseem Raja condemn that whats app message.

మదరసాల్లో ఉండేది తేడాగాళ్లు అన్న ప్రొఫెసర్

Posted: 05/27/2015 11:00 AM IST
A alighad muslim university professonr said that there is gays in the madarasas

ముస్లిం మదరసాల గురించి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులలో స్వలింగ సంపర్కులు ఉన్నారని, ఇతర మదరసాలలో కూడా ఇటువంటి వ్యవహారం నడుస్తోందంటూ ఆ ప్రొఫెసర్  వాట్సాప్ లో  పోస్ట్ చేశారు. ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే మదరసాలపై నిషేధం విధించాలని సూచించారు. యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వసీం రాజా తన వాట్సాప్ ద్వారా ఓ ఛానల్కు ఈ  మెసేజ్ ను పంపించారు.

అయితే దేశంలో వేల కొలది మదరసాలు ఉన్నాయి. అందులో లక్షల మంది పిల్లలు ఉంటున్నారు. అలాంటి మదరసాల గురించి ఓ యూననివర్సిటి ప్రొఫెసర్ ఇలా వ్యాఖ్యానించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో నాలుక్కరుచుకున్న ప్రొఫెసర్  ఆ సందేశాలు తాను పంపలేదని, తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని ప్రొఫెసర్ వసీం తెలిపారు మొత్తానికి వసీం చేసిన వాట్సాప్ మెసేజ్ ముస్లిం వర్గాల్లో తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.   వసీం రాజా వ్యాఖ్యలను యూనివర్సిటీ డైరెక్టర్ రషీద్ షాజ్ ఖండించారు. మదరసా విద్యార్థులు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటారని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madarasa  Muslims  gays  vassem Raja  Aligarh  

Other Articles