beef | Nakvi | Kiran rijuja

Central ministers clash on beef

beef, Nakvi, Kiran rijuja, Maharastra, Ban

Central ministers clash on beef. central minister abbas nakvi said that beef eating people may go to pakistan. Kiran rijuja said that he will eat beef, and who can stop him.

మంత్రుల మధ్య గొడ్డు మాంసం గొడవ

Posted: 05/27/2015 10:05 AM IST
Central ministers clash on beef

కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ తాజాగా ఓ వ్యవహారం మాత్రం ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. మోదీ హయాంలో కేబినెట్ మంత్రులుగా సాగుతున్న వారు ఒకరికి ఒకరంటే పడకపోవడమా...? అంత మ్యాటర్ ఏంటీ..? అనుకుంటున్నారా..? అదేనండీ బీఫ్ వివాదం. గొడ్డు మాంసం తినకపోతే బ్రతకలేని వారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ కు వెళ్లాలని అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు.  తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి గొడ్డు మాంసం ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య గొడవ పెట్టింది.

నక్వీ చేసిన వ్యాఖ్యలను ఖండించేలా రిజుజా స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను గొడ్డు మాంసం తింటానని. తనతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందన్నారు. బీఫ్ తినవద్దని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ నక్వీపై కిరణ్ రిజిజు మండిపడ్డారు.  ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే..   మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడని చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beef  Nakvi  Kiran rijuja  Maharastra  Ban  

Other Articles