ap, special status, central govt, protest, modi, chandrababu

Ap state bifercation completed one year but the central govt didnt conform the special status to the ap

ap, special status, central govt, protest, modi, chandrababu

ap state bifercation completed one year but the central govt didnt conform the special status to the ap. so the people of ap getting ready to strike.

ఇక ఆంధ్రాలో ఉద్యమాలు తప్పవన్నట్లే..!

Posted: 05/25/2015 04:42 PM IST
Ap state bifercation completed one year but the central govt didnt conform the special status to the ap

విభజన జరిగి ఏడాదికావొస్తున్నా, ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటికీ స్పష్టత లేదు. స్పెషల్ స్టేటస్ పై నీళ్లు నములుతున్న కేంద్రం.. నిధులు మాత్రం ఎక్కువగానే కేటాయిస్తామని చెబుతోంది. కేంద్రం తీరుపై ఏపీలో తీవ్ర అసహనం వ్యకమవుతోంది. తాజాగా, ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో.. ఏపీ మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. హామీని నేరవేర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం జనం ఆవేదనను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్పేషల్ స్టేటస్పై ఏపీ నేతలు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా.. ఎస్ చెప్పడం లేదు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా, ప్రత్యేకహోదా లేనట్టేనని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇక వెంకయ్య నాయుడు విషయం అయితే మరీ విడ్డూరం. ఆయన ఏం మాట్లాడతారో క్లారిటీ ఇచ్చి మరీ కన్ఫూజ్ చేస్తారు. కర్ర విరగకుండా పాము చావకుండా రక్షణాత్మక ధోరణిలో సమాధానం చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చాం.. కానీ 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం అది సాధ్యం కాకపోవచ్చు అన్నది జైట్లీ మాటల అర్థం. దీంతో ఏపీలో మళ్లీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి మృణాళిని. ఆంధ్రప్రదేశ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. గత ప్రభుత్వం సరిగ్గా డాక్యుమెంటేషన్ చేయకపోవడం వల్లే.. ఇప్పటి ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతుందన్నారాయన. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి.. ఇప్పుడు మాట మార్చడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే.. స్పెషల్ స్టేటస్పై కేంద్రం వెంటనే ఏదోకటి తేల్చి చెప్పాలన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు. ప్రత్యేక హోదాకు14వ ఆర్థిక సంఘం నివేదికే అడ్డంకి అని చెబుతున్న బీజేపీ నేతలు.. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను లెక్కలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ నేతలు. మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే దిక్కులేని పరిస్థితి రావడమేంటని మండిపడుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  special status  central govt  protest  modi  chandrababu  

Other Articles