Indian-origin man jailed for taking upskirt videos of women

Indian origin man jailed for taking upskirt videos of women

Nantha Kumar Palakrishnan, upskirt videos, six months jail, Singapore, Upskirt videos of women, Nantha, indian-origin man jailed, international news, news, singapore news, modesty of the women

A 34-year-old Indian-origin man has been jailed for six months for taking upskirt videos of nearly 60 women in public places

సెల్ ఫోన్ లో 60 మంది మహిళల అర్థనగ్న విడియోలు..

Posted: 05/23/2015 01:43 PM IST
Indian origin man jailed for taking upskirt videos of women

నీచ  బుద్ది వున్నవారు భూమండలంలో ఎక్కడవున్నా మారరు. తమ బుద్దిని మార్చుకోరు. భారతీయ సంతతికి చెందిన నంతకుమార్ పాల కృష్ణన్కు ఒక నీచుడు తన నీచ బుద్దితో భారత పరువును దేశం కాని దేశంలోనూ తీసి కటకటాలపాలయ్యాడు. తన ఐ ఫోన్తో బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించాడు.  దాదాపు 60 మంది మహిళలను వారికి తెలియకుండా అర్ధనగ్న వీడియోలు తీశాడు. చివరకు గుట్టురట్టు కావడంతో నిందితుడికి పోలీసులు అరదండాలు వేశారు. మహిళల అర్థనగ్న వీడియోలు చిత్రీకరించినందుకు సింగపూర్ న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్షను విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన 34 ఏళ్ల నంతకుమార్ తన ఐఫోన్ 4ను తన ల్యాప్టాప్ బ్యాగులో పెట్టుకుని తిరిగేవాడు. బ్యాగులో పుస్తకాల పైభాగంలో కెమెరా పైకి ఉండేలా ఐఫోన్ను ఉంచుతాడు. కెమెరాను రికార్డింగ్ మోడ్లో ఉంచి, బ్యాగుకు జిప్ వేయకుండా అలాగే వదిలేసేవాడు. స్కర్ట్లు ధరించిన మహిళలను అతను టార్గెట్ చేసేవాడు. బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళల పక్కన, వెనుక వైపున ఈ బ్యాగును కిందపెట్టేవాడు. ఇలా మహిళల అర్ధనగ్న దృశ్యాలను వీడియో తీశాడు.

ఈ క్రమంలో ఓ షాపింగ్ మాల్లో ఓ మహిళను అసభ్యంగా వీడియో తీస్తుండగా అతని బండారం బయటపడింది. నిందితుడు ఆమె వెనుక నేలపై బ్యాగ్ ఉంచాడు. ఆమె సహోద్యోగికి సందేహం వచ్చి ప్రశ్నించడంతో ఏమీ తెలియనట్టుగా క్షమాపణలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన మహిళ సహా అమె సహోద్యోగి బ్యాగ్ తెరిచి చూడగా, ఐఫోన్ కెమెరా రికార్డింగ్ మోడ్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళతో సహా చాలా మంది మహిళల అసభ్య దృశ్యాలు అతని ఫోన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరపరచగా ఆర్నెళ్లు జైలు శిక్ష విధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nantha Kumar Palakrishnan  upskirt videos  six months jail  Singapore  

Other Articles