President Obama's New Twitter Account Creates New Guinness World Record

Obama breaks guinness record with new twitter account

Barack Obama, Twitter, social networking, Web Exclusive, Guinness World Record, Guinness record, Twitter account, POTUS account, ‘Iron Man’ star Robert Downey Jr., million followers, potus, flotus, twitter, robert downey jr, us president, guinness book of world records, guinness records, world record, others, world

The new record set by Obama’s new @POTUS account beat the previous record, which was set last year by ‘Iron Man’ star Robert Downey Jr., after the actor reached a million followers in 23 hours and 22 minutes,

గిన్నిస్ రికార్డులకు ఎక్కిన అగ్రరాజ్యం అధ్యక్షుడు

Posted: 05/20/2015 08:54 PM IST
Obama breaks guinness record with new twitter account

అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా..  అమెరికాలో ప్రత్యర్థులనే కాదు ఇటు ఇటు గిన్నెస్ రికార్డును కూడా బద్దలు కొట్టారు. అదేంటి గతంలో అనేక మంది అధ్యక్షులు వున్నా.. దేశ ప్రజలలో తమదైన ముద్ర వేసుకున్నా వారినే తలదన్నేలా ఒబామా ఏం చేశాడాని అని మీకు సందేహాలు వస్తున్నాయి కదూ. అదేం లేదండీ సాంకేతిక విప్లవం తీసుకోచ్చిన అనేక మార్పులతో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇన్నాళ్లు తన పేరున వున్న ట్విటర్ అకౌంట్ కు బదులుగా అధికారికంగా ఫోటస్ పేరుతో బరాక్ ఒబామా నూతనంగా ట్విట్టర్లో ఖాతా తెరిచాడు.

అయితే ఈయన ఖాతా తెరిచిన ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరు మీద తెరిచిన అకౌంట్కు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. అగ్రరాజ్యం అధ్యక్షుడా మజాకా అన్న రీతిలో ప్రపంచ వ్యాప్తంగా తన ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు ఒబామా.

ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచి, అంతలోనే పనిలోపనిగా గిన్నెస్ రికార్డు కూడా సాధించేశారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్హౌస్ ఇంటర్నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barrack obama  Guinness record  Twitter account  

Other Articles