Housewife burned her mother-in-laws home in tamilnadu for not calling her to live with them

Housewife burned her mother in laws home in tamilnadu

women burned laws home, tamilnadu crime news, sister in law killed family members

Housewife burned her mother-in-laws home in tamilnadu : Housewife burned her mother-in-laws home in tamilnadu for not calling her to live with them

కాపురానికి పిలవలేదని కొంప కొల్లేరు చేసేసిందమ్మో!

Posted: 05/20/2015 11:21 AM IST
Housewife burned her mother in laws home in tamilnadu

కోరుకున్న వారికోసం మహిళలు తమ జీవితాన్ని త్యాగం చేసి వారి సేవలోనే జీవితాంతం గడిపేస్తుంది. కానీ.. వారే తనకు అన్యాయం చేస్తే మాత్రం ఉగ్రరూపం దాల్చి బలితీసుకుంటుందన్న వ్యాఖ్యను ఓ మహిళ చేసి నిరూపించింది. గంపెడాశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలికి ఆ ఇంట్లో సరైన గౌరవం లభించకపోవడంతోపాటు కాపురానికి పిలవలేదన్న కోపంతో ఆ ఇంటినే తగలబెట్టేసింది. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తన భర్త తనను చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతో భార్య తన అత్తారింటిని నిప్పు పెట్టేసింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆమె తన భర్త, అత్త మామలు నివసిస్తున్న ఇంటికి నిప్పంటించింది. దాంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవదహనమయ్యారు. అంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం ఆమె స్వయంగా వెళ్లి, పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే భార్యాభర్తల మధ్య ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women burned laws home  tamilnadu crime news  

Other Articles