nepal | earth quake | modi | india

Nepal prime minister sushil koyirala will meet the pm modi

nepal, earth quake, modi, india

Nepal prime minister sushil koyirala will meet the pm modi. He will ask for cooperation to nepal.

అప్పుడు పో.. అని ఇప్పుడు రండి బాబూ అంటున్నారు

Posted: 05/19/2015 01:09 PM IST
Nepal prime minister sushil koyirala will meet the pm modi

పాపం అని దయదలిచి సహాయం చేస్తే వద్దు వద్దు అంటూ భారత సైనికులను తిప్పిపంచింది నేపాల్. గత వారంలో జరిగిన భారీ భూకంపానికి నేపాల్ మొత్తం కకావికలం అయింది. దాంతో పక్కనున్న దేశంగా భారత్ తనవంతు సహాయాన్ని అందించింది. వేల మంది సైనికులను అక్కడికి పంపించడం, రెస్కూ టీంల సహాయంతో భూకంప బాధితులను రక్షించడం, అక్కడి బాధితులకు తాగు నీరు, ఆహారం లాంటి వాటిని అందించడం భారత్ చేసింది. అయితే అక్కడ తమ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలకు అడ్డుకలుగుతోందని, భారత మీడియా అతి చేస్తోందని, భారత్ సాయంపై అంతర్జాతీయంగా వెల్లువెత్తిన ప్రశంసలతో నేపాల్ అక్కడి నుండి తమ సహాయ కార్యక్రమాలను నిలిపివెయ్యాలని, అక్కడికి సహాయం చెయ్యడానికి వచ్చిన వారిని వెంటనే వెళ్లిపోవాలని కోరింది. దాంతో అక్కడి నుండి చాలా మంది తిరిగి ఇండియాకు వచ్చేశారు.

అలా సహాయం చెయ్యడానికి వెళ్లిన భారతీయులకు ఓ రకంగా అవమానమే జరిగింది. మంచి చెయ్యడానికని వెళితే చెడు ఎదురైనట్లుంది భారత్ పరిస్థితి. అయితే భారత్ సాయం లేదని తాము తిరిగి కుదుటపడే పరిస్థితిలో లేమని అక్కడి వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. తమ దేశానికి ఇండియా సహాయం ఖచ్చితంగా కావాల్సిందేనని ఆయన ప్రధానిని కోరనున్నారు. అయితే అప్పుడు పొమ్మ్న్న వారే ఇప్పుడు మాత్రం రమ్మని మరీ బొట్టు పెట్టి పిలుస్తున్నారు. అప్పుడు అవమానించిన వారే ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానం పలుకుతున్నారు. బహుశా దీన్నే బ్యాడ్ టైం అంటారేమో. మరి దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal  earth quake  modi  india  

Other Articles