Facebook 'fire challenge' for parents

Facebook fire challenge faces criticism

Facebook 'fire challenge' for parents, facebook fire challenge faces criticism, Ice Bucket Challenge, Fire Challenge, Facebook, Gloucestershire, YouTube, criticism,

While the Ice Bucket Challenge drew its fair share of criticism in the past, now a 'fire challenge' is turning out a headache for parents.

వెర్రి వెయ్యి రకాలు.. పిల్లల సాహసాలతో తల్లిదండ్రులు కంగారు..

Posted: 05/18/2015 08:55 PM IST
Facebook fire challenge faces criticism

వెర్రి వెయ్య రకాలని పెద్దలు అంటుంటారు కానీ, దానిని నిజంగా చేస్తు.. ఇక్కడ కోందరు యువకులు సాహసం చేస్తూ తల్లితండ్రులకు కంగారు పెట్టిస్తున్నారు. అదేంటి అన్న సందేహాలు వద్దండోయ్. డైరెక్టుగా విషయానికి వస్తున్నాం. గతంలో ఫేస్బుక్ వేదికగా ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన 'ఫైర్ ఛాలెంజ్' మాత్రం విపరీతంగా విమర్శల పాలవుతోంది. ఇది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. తమ బిడ్డలు ఎక్కడ ఇలాంటి సాహాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారోనని కంగారు పడుతున్నారు. ఎందుకంటారా..?

ఈ ఫైర్ ఛాలెంజ్ లో పిల్లలు ఒంటిమీద కిరోసిన్ లాంటి ద్రవాన్ని పోసుకుని, నిప్పంటించుకుంటున్నారు. ఆ తర్వాత మంటలు వ్యాపించేలోగా వాళ్లు స్విమ్మింగ్ పూల్లోకి దూకాలి. అయితే, ఈ ఛాలెంజిలో పాల్గొంటున్న యువకుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. దాంతో ఇలా నిప్పంటించుకుని గాయపడిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను ఆన్లైన్లో పెట్టొద్దంటూ వేడుకుంటున్నారు. ర్ఛాలెంజ్లో పాల్గొన్న టైలర్ ఓ కానర్ (9), అతడి అన్న షౌన్ (11) తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. వాళ్లు నిప్పంటించుకున్న వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా వ్యాపించింది. ఇది ఫేస్బుక్, యూట్యూబ్లలో కూడా షేర్ అయ్యింది. ఇలాంటి  ఇబ్బందుల్లోకి తోటి పిల్లలను నెట్టొద్దని వాళ్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు ఏ ఫోన్ వచ్చినా భయం వేస్తోందని, పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనో.. మరణించారనో కబురు వస్తుందన్న భయంతో ఉన్నామని అంటున్నారు. లండన్ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా నిప్పుతో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేయొద్దనే చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  fire challenge  criticism  

Other Articles