parrot | youtube | laughing

A parrot populor on youtube for its laughing

parrot, youtube, smile, laughing, popular

A parrot populor on youtube for its laughing. the parrot laughing got near four lakh likes in yoputube by one week.

ITEMVIDEOS: ఆ చిలక నవ్వే నవ్వు.. తెగ హల్ చల్ చేస్తున్న వీడియో

Posted: 05/18/2015 03:59 PM IST
A parrot populor on youtube for its laughing

ఎవరైనా చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అబ్బా. భలే మాట్లాడుతున్నాడు.. అచ్చం చిలుక పలుకుల్లా ఉన్నాయి అంటూ తెగ కాంప్లిమెంట్ లు ఇస్తుంటారు చాలా మంది. ఎందుకంటే కొంత మంది మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఇక చిలుక అంటే గుర్తుకు వచ్చింది.. చిలుకలు మనుషులు మాట్లాడే కొన్ని మాటలను మిమిక్రి చేస్తాయి అని విన్నాం.. చాలానే చూశాం కూడా. అయితే యూట్యూబ్ లో చిలుక తెగ హల్ చల్ చేస్తోంది. అప్పటి వరకు ఏ చిలుకకు రానంత క్రేజీ ఫాలోయింగ్ ఆ చిలుక సొంతం. ఇంతకీ అంతలా పాపులర్ కావడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా.. ఆ చిలుక నవ్వు. అవును ఆ చిలుక నవ్వితే యూట్యూబ్ మొత్తం షేక్ అయింది.

మాటలు చాలా కమ్మగా మాట్లాడుతున్న చిలుకల గురించి విన్నాం.. అయితే తాజాగా యూట్యూబ్ కు ఎక్కిన ఈ చిలుక మాత్రం నవ్వుతో రికార్డులు పుట్టిస్తోంది. పాత కాలంలో రావుగోపాల్ రావు, కైకాల సత్యనారాయణ లాగా భలే నవ్వుతోంది ఈ చిలుక. అందుకే ఈ చిలుక ఇప్పుడు యూట్యూబ్ లో పాపులర్ అయింది. ఈ వీడియోను అప్ లోడ్ చేసిన వారం రోజుల్లోనే నాలుగు లక్షల మందికి పైగా చూశారు. అందుకే ఈ చిలుక ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parrot  youtube  smile  laughing  popular  

Other Articles