etela rajender bullet proof vehicle met accident

Provindential escape for etela rajender

Provindential escape for Etela Rajender, etela rajender bullet proof vehicle met accident, Etela rajender, bullet proof vehicle, rams, roadside tree, telangana minister eetala rajender,

A bullet proof vehicle in the convoy of Telangana minister for finance Etela Rajender rammed into a road side tree on Monday.

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కు తప్పిన ప్రమాదం..

Posted: 05/18/2015 12:13 PM IST
Provindential escape for etela rajender

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. మంత్రిగా ఆయన నియమితులైనప్పటి నుంచి ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఎన్నికైప్పటి నుంచి ఆయన ఈ కారులో నిత్యం ప్రయాణిస్తువున్నారు. అయితే ఇవాళ అనూహ్యంగా ఈ కారు ప్రయాదానికి గురికావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ఈటెల ఆ కారులో ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.

మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూప్ వాహనం.. మెట్ పల్లి వద్ద చెట్టును ఢీకొంది. వాహనశ్రేణి హుజురాబాద్ నుంచి వెంకట్రావ్ పల్లి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అయితే ప్రమదాదానికి గల కారణాలు తెలియరాలేదు. వాహనం చెట్టును ఢీకోన్న ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాహనంలో సాంకేతిక పరమైన లోపాలే ప్రమాదానికి కారణమా లేక.. మరే ఇతర అంశాలు ప్రమాదానికి దారి తీశాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : etela rajender  bullet proof vehicle  accident  

Other Articles