Delhi | Kejriwal | Corruption

Delhi cm kejriwal told that his daughter offer coruption to govt officers but the officers didnt take any money

Delhi, Kejriwal, Corruption

Delhi cm Kejriwal told that his daughter offer coruption to govt officers. But the officers didnt take any money.

కేజ్రీవాల్ కూతురు లంచం ఇవ్వాలనుకుంది..!?

Posted: 05/18/2015 11:44 AM IST
Delhi cm kejriwal told that his daughter offer coruption to govt officers but the officers didnt take any money

అవును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు లంచం ఇవ్వడానికి ట్రై చేసింది. సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. అవినీతిని నామరూపాలు కూడా లేకుండా చేస్తామని మాటల కోటలు కట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందా..? అన్న ప్రకారం ఢిల్లీలో అవినీతి మరకలు లేకుండా పాలనసాగుతోందా..? అవినీతిని పాతాళానికి తొక్కేస్తాను, మార్పును మీ కళ్లకు చూపిస్తాను అన్న కేజ్రీవాల్ మాటలు నిజమయ్యాయా..? అంటే దానికి సమాధానాలు అరవింద్ కేజ్రీవాలే చెబుతున్నాడు. అందునా తన కూతురు గురించి కూడా ప్రస్తావిస్తు డిల్లీ అవినీతి గురించి మాట్లాడారు.

ఢిల్లీలో తాము అదికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని దాదాపుగా అంతం చేశామని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అందుకు సాక్షంగా తన కూతురు కథనే కేజ్రీవాల్ సాంపల్ కింద వివరిస్తున్నారు. తన కూతురు లైసెన్స్ కోసం వెళితే ఓ డాక్యుమెంట్ మరిచిపోయిందని.. మళ్లీ ఇంటికి వెళ్లి తీసుకువచ్చే ఓపిక లేక.. ఎలాగోలా మానేజ్ చెయ్యాలని అధికారులకు లంచం కూడా ఇవ్వాలని ట్రై చేసిందని అరవింద్ వివరించారు. అయితే ఆమె చేసిన ఆఫర్ ను వాల్లు రిజక్ట్ చెయ్యడమే కాకుండా డాక్యుమెంట్ తెస్తేనే లైసెన్స్ వస్తుందని ఖరాఖండిగా చెప్పేశారట. ఇదే ఢిల్లీలో అవినీతి లేదు అని చెప్పడానికి నిదర్శనం అంటున్నారు కేజ్రీవాల్. మొత్తానికి తన హయాంలో అవినీతి జాడ లేదు అని తిప్పి తిప్పి భలే చెప్పారు కేజ్రీవాల్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Kejriwal  Corruption  

Other Articles