Dress code row: Bastar DM defends himself, says 'can't wear bandhgala at 40°C'

Bastar collector defends himself for wearing sunglasses and bandhgala while receiving pm modi

Bastar collector defends himself for wearing sunglasses while receiving PM Modi, katariya says can't wear bandhgala at 40°C', amit katariya, ias officer, black glasess, notices, raman singh chattisgarh, bastar, amit katariya, narendra modi, bastar district collector,

the IAS officer amit katariya defended himself for wearing sunglasses and bandhgala while receiving PM Modi on social networking sites saying a formal suit or a 'bandhgala' at sweltering 40 degrees was impractica

ప్రధాని ‘దబాంగ్’ కలెక్టర్ సమాధానంతో సిద్దమయ్యాడు..

Posted: 05/17/2015 12:14 PM IST
Bastar collector defends himself for wearing sunglasses and bandhgala while receiving pm modi

నీలి రంగు చొక్కా.. నలుపు రంగు ప్యాంటు.. నల్ల కళ్లజోడు ధరించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఆ వ్యక్తి.. బస్తర్ జిల్లా కలెక్టర్. పేరు అమిత్ కటారియా. చూడటానికి ఠీవిగా అనిపించేసరికి ఆయనను ప్రధాని నరేంద్రమోడీ దబాంగ్ కలెక్టర్ అని కామెంట్ చేసేసరికి ఆయన ఇప్పుడు వార్తల్లో నిలిచారు. గత రెండు రోజుల క్రితం ఆయన వార్తల్లో పతాక శీర్షికను కైవసం చేసుకున్నారు కూడా.. ఎందుకంటారా..? ఇంతకీ విషయం ఏమంటే.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలను కలిసినప్పుడు సివిల్ సర్వీసు అధిరాలు ఎవరైనాసరే నల్ల కళ్లజోడు ధరించరాదన్నది ప్రోటోకాల్ నియమం. అంతేకాదు సూటులో మాత్రమే వారు వీవీఐపీలను రిసీవ్ చేసుకోవాలని లేని పక్షంలో వారు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తలొంచక తప్పదు.

కటారియా అలా కళ్లజోడుతో పీఎంను కలుసుకోవడంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోపగించుకుంది.. అసలు నల్ల కళ్లజోడు ధరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ గత శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ అమిత్ కటారియా. కూడా సమాధానం ఇచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. ముందుగా తాను తన చర్యలను సమర్థించుకున్నాడు. 40 డిగ్రీల ఎండలో బంద్ గలా (సూటు) వేసుకోవడం అసాధ్యమని, తాను తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. బస్తర్ అత్యంత గ్రీష్మతాపాన్ని ఎదుర్కుంటున్న జిల్లా అని, ప్రధాని వచ్చిన రోజున సుమారుగా 40 డిగ్రీల ఉష్టోగ్రత నమైదైందని.. ఆ పరిస్థితులలో బంద్ గల వేసుకోవడం అసాధ్యమని తన ఐఎఎస్, ఐపీఎస్ మిత్రులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit katariya  ias officer  black glasess  notices  

Other Articles