V hanumantha rao controversial comments on cm kcr | Rahul Gandhi Kisan Sandesh Yatra

Rahul gandhi kisan sandesh yatra cm kcr v hanumantha rao

rahul gandhi, cm kcr news, v hanumantha rao, tummala nageswara rao, kisan sandesh yatra, telangana state, rahul adilabad yatra, kcr controversies, kcr updates, kcr news

Rahul Gandhi Kisan Sandesh Yatra Cm Kcr V Hanumantha Rao : V Hanumantha counter attack on trs party. He said that rahul gandhi came to telangana to open cm kcr and trs party eyes to know the problems of farmers.

రాహుల్ ‘రైతు యాత్ర’తో కేసీఆర్ కళ్లు తెరుచుకున్నాయా?

Posted: 05/16/2015 06:54 PM IST
Rahul gandhi kisan sandesh yatra cm kcr v hanumantha rao

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కిసాన్ సందేశ్ యాత్ర’ పేరిట తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి.. తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే.. తన ప్రసంగంతో రైతులకు భోరాసా కల్పించారు. రైతులకు నిత్యం అండగా వుండేది కాంగ్రెస్ పార్టీయేనని, అవసరమైతే రైతుల కోసం పార్లమెంటులో పోరాడతానని, ఉద్యమించడానికైనా తాను సిద్దమని రాహుల్ గాంధీ రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే.. ఈ రాహుల్ పర్యటనపై రకరకాలుగా వ్యాఖ్యలు, వార్తలు వెలువడుతున్నాయి. రాహుల్ గాంధీ రైతులను పరామర్శించి నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కళ్లు తెరుచుకుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు బలైపోతున్నారన్న విషయం రాహుల్ గాంధీ పర్యటన ద్వారా టీఎస్ ప్రభుత్వానికి తెలిసొచ్చిందని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టేసుకుంటోంది. ముఖ్యంగా.. రాహుల్ పర్యటన సీఎం కేసీఆర్ కళ్లు తెరిపించిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరికొంతమంది మాత్రం రాహుల్ యాత్రపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే రాహుల్ ను అమాయకంగా పోల్చుతూ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మీద తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ యాత్ర రైతులకు భరోసా కల్పించడం కోసం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ని బలపరుచుకోవడం కోసమేనని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఈయన చేసిన వ్యాఖ్యలకు అటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తుమ్మల కామెంట్లపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు ఘాటుగానే స్పందించారు. కేసీఆర్ కళ్లు తెరిపించేందుకే రాహుల్ గాంధీ వచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా.. కేసీఆర్ ఏమాత్రం స్పందించలేదని అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ పర్యటనతోనైనా రైతుల కష్టాలు తెలంగాణ సర్కార్ కి తెలిసొస్తాయని, ఈసారైనా కేసీఆర్ కళ్లు తెరుస్తారనుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా ఈయన చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  kisan sandesh yatra  kcr  hanumantha rao  

Other Articles