andhrapradesh government to acquit farmers land with go 166

Ap government issued land acquisition go

ap government issued land acquisition go, andhrapradesh government to acquit farmers land with go 166, go 166, land acquisition, ap capital amaravathi, ap government, chandrababu, narayana, minister narayana, chief minister chandrababu,

andhrapradesh government issues GO 166 to acquit farmers land for capital amaravathi

భూసేకరణకు జీఓ జారీ చేసిన ఏపీ సర్కార్

Posted: 05/14/2015 04:42 PM IST
Ap government issued land acquisition go

రాజధానికి భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటూ న్యాయస్థానాలను అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఆశ్రయిస్తూ.. ఓ వైపు నిరసనలు, ఆందోళనలతో తమ వ్యతిరేకతను ప్రకటిస్తున్నా..  మరోవైపు  రైతుల  నుంచి వారి భూములను బలవంతంగా లాక్కోవడానికి నవ్యాంధ్ర సర్కారు అడుగుముందుకేసింది. రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చేందుకు వ్యతిరేకించిన రైతుల నుంచి వారి భూములను బలవంతంగా సేకరించేందుకు నూతన ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.

భూ సమీకరణకు రూపొందించిన సీఆర్డీఏ చట్టం విఫలమవడంతో ప్రభుత్వం కొత్తగా భూసేకరణకు జీఓ నెంబరు 166ను జారీ చేసింది.  కేంద్ర ప్రభుత్వం  కొత్తగా జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుకూలంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణ చట్టం-2013లో 2.3 చాప్టర్లను మినహాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణ వల్ల సామాజిక ప్రభావం నిబంధనలను ఈ నోటిఫికేషన్లో మినహాయించింది. రెండు,మూడు పంటలు పండే భూములను సేకరించే నిబంధనలను మినహాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారం నుంచి భూసేకరణ చట్టం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెలఖారు లోగా పంటలు చేతికందుతాయని, అవి పూర్తికాగానే భూ సమీకరణను పనులను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రేపటి నుంచే భూ సేకరణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. భూములను ఇచ్చేందుకు అంగీకరించని రైతుల భూములను 2013 భూసేకరణ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకుంటమాని, అ నిబంధనలో పోందుపర్చినట్లే పరిహారం కూడా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు కోర్టుకు వెళ్లడం వల్లే భూసేకరణ ఆర్డినెన్సును తీసుకురావాల్సివచ్చిందన్నారు. ఇప్పటి వరకు 14800 ఎకరాలను అప్పగిస్తూ రైతులు అంగీకార ఒప్పందాలు ఇచ్చారని మంత్రి నారాయణ చెప్పారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land acquisition GO 166  AP government  AP Capital  

Other Articles