eloped couple beaten and burnt alive in gaya on the orders of the village panchayat

Bihar couple set on fire villagers watched nobody called cops

Gaya couple burnt alive, couple burnt to death, Gaya, Bihar honour killing, bihar couple lynched, panchayat order, gaya, Couple Murder, Bihar village panchayat, Bihar Police, Village court, Gaya honour killing, eloped, lovers mercilessly beaten, lovers burnt to death, orders of a village panchayat, Gaya district, Bihar, 16-year-old girl, 36-year-old man, police, FIR, Gaya Police,

A man and a teenager who had eloped were beaten mercilessly and set on fire on Wednesday as hundreds watched at a village in Bihar's Gaya.

వివాహేతర సంబంధం.. సజీవ దహణం పరిష్కారామా..?

Posted: 05/14/2015 03:51 PM IST
Bihar couple set on fire villagers watched nobody called cops

మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా.. మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండీ.. ఏ లోపం లేని వారు ఎవరో చూపండీ అంటూ ఆంధ్రుల అభిమాన నటుడు స్వర్గీయ ఎన్టీరామారావు పాడిన పాటను బీహార్ లోని గయ వాసులకు వినిపించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే అక్కడ ఇకా ఆటవిక శిక్షలు అమలవుతున్నాయి. ఇటీవల తన పెళ్లి రద్దు చేయాలని, తనకు ఏడాది కూడా నిండకుండా పసిదానిగా వున్న వయస్సులో పెళ్లి చేశారని అది చెల్లదని, దానిని రద్దు చేయాలని కోరిన ఓ బాలిక తండ్రికి 16 లక్షల రూపాయల జరిమానా విధించిన కాప్ (కుల) పంచాయితీ ఘటన వెలుగులోకి వచ్చిన రెండురోజుల్లోనే తాజాగా, ఇప్పుడు బీహార్ లోని గయలో మరో గ్రామ పంచాయితీ దాష్టికం బయటకు వచ్చింది.
.
అక్రమ సంబంధం వుందన్న ఆనుమానాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఆటవికమైన శిక్షను అమలు చేశారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చిన 67ఏళ్ల గడుస్తున్నా. బలమైన న్యాయవ్యవస్థ, చట్టాలు వున్నా.. ఇంకా కులపంచాయితీల ఆటవిక శిక్షలు.. అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో.. దానిని నిర్థారించకుండానే.. 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా  కొట్టి సజీవ దహనం చేశారు.

పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వ్యక్తి  తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఈ పదహారేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది.  మూడు  రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు.  దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు.  ఈ క్రమంలోనే పంచాయతీ  పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల  ప్రకారమే బుధవారం  ఈ శిక్షను అమలు చేశారు.  బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ ఘోరం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను  వ్యతిరేకించలేదు,  కనీసం పోలీసులకు తెలియజేయలేదు.

పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు.ఈ ఘటనకు సంబంధించి  ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా  అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు. తప్పు చేసిన వారిని శిక్షించడానికే కోర్టులు, చట్టాలు ఉన్నా.. కుల, గ్రామ పంచాయితీలు శిక్షలను విధించడంపై మానవ హక్కుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకా మధ్య యుగాల నాటి శిక్షలు అమలు కావడంపై  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gaya  burnt alive  village panchayat  

Other Articles