Emergency service provider 108 starts their strike from today onwards in telangana state | gvk meetings

Emergency service provider 108 starts strike telangana state gvk meetings

108 strike, rtc strike news, emergency service provider, telangana state news, cm kcr news, 108 employees strike, telangana govt news

Emergency service provider 108 starts strike telangana state gvk meetings : 108 Employees started their strike from today onwards in telangana state. gvk meetings with employees are failed.

తెలంగాణలో మోగిన ‘108’ సమ్మె సైరన్.. చర్చల శూన్యఫలితమే కారణం!

Posted: 05/14/2015 07:32 AM IST
Emergency service provider 108 starts strike telangana state gvk meetings

తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల్లో నిన్నటివరకు స్తంభించిపోయిన ఆర్టీసీ సమ్మె సుఖాంతమవ్వగా.. ఇప్పుడు తాజాగా ‘108’ సైరన్ మోగింది. గతకొన్నిరోజుల నుంచి తమ డిమాండ్లు తీర్చాల్సిందిగా ‘108’ సిబ్బంది ఎంతో వేడుకున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో వారు సమ్మె ‘సై’రన్ మోగించారు. గత నెలలోనే సమ్మె నోటీసు 108 సిబ్బంది ఇచ్చింది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు నిర్వహించలేదు. అయితే.. తమ డిమాండ్ల వ్యవహారంపై జరిపిన చర్చలు రెండుసార్లూ విఫలం కావడంతో 108 సిబ్బంది ఈసారి సమ్మె సైరన్ మోగించేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘108’ అత్యవసర వైద్యసేవలు స్తంభించే అవకాశముంది.

వేతనాలు, ఉద్యోగభద్రత వంటి 15 డిమాండ్లు ఆమోదించాలని, లేకపోతే సమ్మె బాటపట్టాల్సి వస్తుందని ఇదివరకే ఉద్యోగులు, సిబ్బంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారి డిమాండ్ల వ్యవహారంపై ఇటీవల సమ్మె ఉద్యోగులతో జీవీకే సంస్థ మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అది సఫలం కాలేదు. అనంతరం తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా కూడా ఫలితం లేకుండాపోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ‘108’ యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్‌ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఈ చర్చల్లో భాగంగా ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని కూడా ఆమోదించకపోవడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభమైంది.

సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాలేదని ‘108’ ఉద్యోగుల సంఘం నేత పల్లి అశోక్ వెల్లడించారు. కాలయాపన కోసం ఒక కమిటీ వేయాలని యాజమాన్యం కోరిందన్నారు. తొలగించిన ఉద్యోగులను తీసుకోబోమని జీవీకే స్పష్టం చేసినట్లు సమాచారం. 1800 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, ‘108’ అంబులెన్స్ వాహనాలు 300 వరకు నిలిచిపోతాయని, అందరూ సహకరించాలన్నారు. మరి.. ఈ సమస్యను తెలంగాణ సర్కార్.. ఎప్పుడు? ఎలా? పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే!

కార్మికశాఖ కమిషనర్ డి.అజయ్ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన చర్చల్లో ఉద్యోగుల పక్షాన టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్‌సింగ్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, సలహాదారుడు జూపల్లి రాజేందర్, ప్రధానకార్యదర్శి జువ్వాడి శ్రీనివాస్, జీవీకే-ఈఎంఆర్‌ఐ జాతీయ ప్రతినిధి శ్రీనివాస్, రామచంద్రరాజు పాల్గొన్నారు. అయితే.. ఈ చర్చల్లో తెలంగాణ ‘108’ ఉద్యోగనేతలెవరూ పాల్గొనకపోవడం గమనార్హం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 108 strike news  telangana govt  cm kcr  

Other Articles