19-Year-Old Girl Annuls Marriage Fixed In Infancy, Caste Panchayat Slaps A Fine Of Rs 16 Lakh

Santa devi fighting back her marriage done at infancy

Santa Devi Meghwal, 19-year-old, girl, annuls, kangaroo court , hefty fine of Rs 16 lakh, Rohichan Khurd village, Luni tehsil, JODHPUR, caste panchayat orders, marriage, fixed, in, infancy,, caste, panchayat, slaps, a, fine, of, rs, 16, lakh, india, Padmaram, evil social practices,

A girl here has decided to annul her marriage which was solemnised in her infancy, prompting a kangaroo court to slap a hefty fine of Rs 16 lakh reportedly on her and ostracise her family from the community.

ఆ పెళ్లిని రద్దు చేయమంటే.. 16 లక్షలు పరిహారం అడిగారు..

Posted: 05/12/2015 09:13 PM IST
Santa devi fighting back her marriage done at infancy

అందరి పిల్లల్లాగే తాను పెరిగింది. తల్లిదండ్రులు చూపించిన ప్రేమ అనురాగాల మధ్య పెరిగి పెద్దదైంది. అయితే ఆక్కడి నుంచి కబురు వచ్చే వరకు తనకు తెలియదు తన వివాహం జరిగిపోయిందని. అయితే తాను అత్తవారింటికి వెళ్లలని. సాంఘిక దురాచాలకు దూరంగా వుండాలని భావించి తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు సరేనన్నారు. అయితే పెళ్లి సమయంలో తీసుకున్న కట్నా కానులకు తరిగిపోయాయేమో తెలియాదు కానీ., అత్తింటి వారు కుల పంచాయితీకి వెళ్లారు. బాల్య వివాహాలను అడ్డకోవాల్సిన కుల పంచాయితీ.. అమె తండ్రిపై భారీ పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఇందుక ఎవరిది బాధ్యత..?

తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతోన్న 11 నెలల పసికూనను తొమ్మిదేళ్ల బాలుడికి ఇచ్చి పెళ్లిచేశారు. అనుకున్న మాట ప్రకారం అబ్బాయి కుటుంబానికి లాంచనాలు ముట్టజెప్పారు. చిన్నారికి ఈడొచ్చాక కాపురానికి పంపించాలని తీర్మానించుకున్నారు. ఆ తరువాత ఆ పాపాయి కుటుంబం ఉపాధి కోసం పల్లె నుంచి పట్నానికి మకాం మార్చింది. కాలం గిర్రున తిరిగింది. ఆ 11 నెలల చిన్నారికి ప్రస్తుతం 19 ఏళ్లు. పేరు శాంతా దేవి మేఘావాల్. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

కాపురానికి రావాలంటూ ఈ మధ్యే  ఆమె అత్తగారి ఇంటినుంచి కబురొచ్చింది. అభం శుభం తెలియని వయసులో జరిగిన పెళ్లి తనకు ఇష్టం లేదని, కాపురానికి వెళ్లే ప్రసక్తేలేదని శాంతాదేవి తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అందుకు సరేనన్నఆమె తల్లిదండ్రులు.. సదరు వరుడి బంధువులకు ఇదే విషయం చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన వరుడి తల్లిదండ్రులు కుల పంచాయతీ పెట్టించారు. శాంతాదేవి కాపురానికి రావాల్సిందేనని గ్రామపెద్దలు బెదిరించారు. రానిపక్షంతో రూ. 16 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన శాంతాదేవి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం జోధ్పూర్లో ప్రెస్మీట్ నిర్వహించి తన గోడును మీడియాకు వెల్లడించింది. బాగా చదుకొని టీచర్ కావాలనుందని, తన బాల్య వివాహం రద్దయ్యేందుకు సహకరించాలని కోరింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా స్సందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బాధితురాలికి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Santa Devi Meghwal  19-year-old  annuls  kangaroo court  Rs 16 lakh fine  

Other Articles