Seventeen endangered monkeys stolen from French zoo | golden lion tamarins | silver marmosets

Seventeen endangered monkeys stolen from french zoo

Seventeen endangered monkeys stolen from French zoo, sanctuary's director Rodolphe Delord, security cameras and patrols, seven golden lion tamarins and 10 silver marmosets, extremely rare monkeys, Saint-Aignan zoo, golden lion tamarins, silver marmosets

Two families of endangered monkeys were stolen from a zoo in central France over the weekend, the sanctuary's director told.

గోల్డెన్ లయన్ టమరిన్.. సిల్వర్ మెర్మోసెట్స్ లను ఎత్తుకెళ్లిన దొంగలు

Posted: 05/12/2015 05:58 PM IST
Seventeen endangered monkeys stolen from french zoo

గోల్డెన్ లయన్ టమరిన్.. సిల్వర్ మెర్మోసెట్స్ అనే శీర్షిక చూసి ఇవేవో అత్యంత ఖరీదైన బంగారు, వెండి ఆభరణాలు అనుకంటే పోరబాటే. ఎందుకంటే.. ఇవి కూడా జీవాలే. దొంగలకు ఏదీ లభ్యం కానప్పుడు.. వాడేసిన చెప్పులు దొరికినా లాభమే అన్న పెద్దల మాటను సద్దిమూటగా భావించినట్లు వున్నారు. అందుకనే మూగ జీవాలను కూడా వదలిపెట్టకుండా ఎత్తుకెళ్లారు. ఏకంగా కోతుల్ని కూడా దొంగలు వదిలిపెట్టలేదు. అంటే ఇప్పటివరకు మేము చెబుతున్నది కోతుల గురించే. అంటే నిజమే. అయితే ఇవి సాధారణ కోతులు కావు.. దక్షిణ, మధ్య అమెరికాలో అత్యంత అరుదుగా కనిపించే వానరాలు. అయితే ఇవి ఎవరికీ ఎలాంటి హాని చేయని సాధు కోతులన్నమాట.

మధ్య ఫ్రాన్స్ లోని సెయింట్ అజ్ఞాన్ జూలాజికల్ పార్కు నుంచి ఈ రెండు తెగలకు చెందిన 17 కోతులను దోంగలు అపహరించుకుపోయారు. జూ లోని సీసీ టీవీ కెమెరాలు, సాయుధ గార్డుల కళ్లుగప్పి చాకచక్యంగా జూలోకి ప్రవేశించిన దొంగలు అత్యంత అరుదుగా లభించే రెండు జాతులకు చెందిన 17 కోతులను అహరించుకుపోయిన ఘటన ఫ్రాన్స్లో సంచలనం సృష్టిస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనను జూ పార్కు డైరెక్టర్ రుడాల్ఫ్ డెలార్డ్ దృవీకరిస్తూ.. వివరాలను మీడియాకు తెలిపారు. దొంగలు ఎత్తుకెళ్లినవాటిలో ఏడు గోల్డెన్ లయన్ టమరిన్స్ కాగా, పది సిల్వర్ మెర్మోసెట్స్. ఈ రెండు జాతులూ అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్నవే కావడం గమనార్హం.

ప్రత్యేక ఏర్పాట్లతో వాటిని సంరక్షిస్తూ వస్తున్న పార్క్ నిర్వాహకులు కోతుల దొంగతనంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రొఫెషనల్స్ తరహాలో సీసీ టీవీ కెమెరాలకు చిక్కడమేకాదు.. ఎలాంటి ఆధారాలూ వదిలేయకుండా దొంగలు కోతుల్ని ఎత్తుకెళ్లారు. 'అసలే అవి సున్నితమైన కోతులు. వాటిలో ఒకదాని తోకకు గాయమైతే పశువైద్యులతో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాం. దొంగలు వాటికి హానితలపెడతారేమోనని ఆందోళనగా ఉంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లు దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు' అని రుడాల్ఫ్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monkeys  stolen  Saint-Aignan zoo  golden lion tamarins  silver marmosets  

Other Articles