Revanth Reddy | Kcr | Telangana | Gang leader

Ttdplp leader revanth reddy onceagain fired on telangana cm kcr

Revanth Reddy, Kcr, Telangana, Gang leader

TTDPLP leader revanth Reddy onceagain fired on telangana cm kcr. He said that kcr is the gang leader of waste fellows.

చవటల గ్యాంగ్ లీడర్ కేసీఆర్: రేవంత్ రెడ్డి

Posted: 05/12/2015 08:47 AM IST
Ttdplp leader revanth reddy onceagain fired on telangana cm kcr

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈసారి కేసీఆర్ ను తిడుతూనే మంత్రులకూ నాలుగు తిట్లు తిట్టాడు. చవటలు, సన్నాసులు, దద్దమ్మ మంత్రులకు కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని టీడీఎల్‌పీ ఉప నేత రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. మందులో సోడాలు పోసే వారికి, తన చెప్పులు నాకే వారికి కేసీఆర్ మంత్రి పదవులిచ్చి పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తరచూ తన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామాలు చేయించి నాటకాలాడే కేసీఆర్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేతో రాజీనామాలు చేయించగలరా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన తర్వాత రాష్ట్రంలో అసలైన రాజకీయం ఆవిష్కృతం అవుతుందన్నారు.

అయినా రేవంత్ రెడ్డి ప్రతీసారి కేసీఆర్ నే టార్గెట్ చేస్తుండటంతో అతని వ్యక్తిగత ఆస్తులు, ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఎంక్వైరీ చేస్తోందని సమాచారం. అయితే అలా సమాచారం తెలిసిన తర్వాతైనా రేవంత్ రెడ్డి ఊరికే ఉంటాడా అనుకున్న వారికి రేవంత్ ఫైరేంటో తెలిసింది. ఈసారి ఏకంగా చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అంటూ తెలుగు భాషలో ఉన్న బూతులను వాడేశారు. అయినా విమర్శించడం అంటే ఇలా బూతులు తిట్టడా అని కొంత మంది పెదవి విరుస్తున్నా తాను మాత్రం కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Kcr  Telangana  Gang leader  

Other Articles