నారా చంద్రబాబు నాయుడు గురించి అందరికి తెలుసు. ఆయన టెక్నాలజీని వాడుకోవడంలో అందరి కన్నా ముందుంటారు దాంట్లో ఎవ్వరికీ, ఎలాంటి సందేహాలు లేవు.. కానీ బాబూ దుబారానే అందరి విమర్శలకు కారణమవుతోంది. తాను దూర సందులేదు కానీ మెడకేమో డోలు అన్న చందంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ఏపి సిఎంగా న్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి బాబు గారు చేసిన దుబారా బాగోతాన్ని నేషనల్ మీడియా కోడైకూసింది. ఏకంగా 100 కోట్ల రూపాయలను కర్పూర హారతిలాగా కరిగించేశారు. బాబు గారి దుబారా గురించి అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా మన వారికి మాత్రం అస్సలు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. తాజాగా బాబు గారి దుబారా గురించి తెలిస్తే మీరు కూడా అవునా.. చంద్రబాబు పేరు తీసి దుబారా బాబు అని పేరుపెట్టేస్తారు మరి.
నిద్ర సుఖమెరగదు అనే నానుడిని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు తిరగరాశారు. నిద్ర సుఖమెరుగు.. అని నిరూపించారు. ఎలాగంటారా...?
ఒకప్పుడు కేవలం సాఫ్ట్ వేర్ జపం చేసిన నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రైతుల గురించి బాగా ఆలోచించడం మొదలు పెట్టారు .అంతే అప్పటి నుండి మీ ఇంట్లో పెద్ద కొడుకును అదీ ఇదీ అని పెద్ద పెద్ద డైలాగ్ లు కొట్టాడు. కాల్వగట్లమీదే పడుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి నారావారు, గురువారం రాత్రి ఆ మాట నిలబెట్టుకున్నారు. కాకపోతే ఐదు గంటల పాటు నిద్రపోవడానికి ఆయన వెచ్చించిన ఖర్చు అక్షరాలా 60 లక్షలు దాటడం గమనార్హం. నమ్మలేకపోతున్నారా? ఇది ముమ్మాటికీ నిజం. జలదీక్షలో భాగంగా ముఖ్యమంత్రి మదనపల్లి సమీపంలోని హంద్రీ-నీవా కాలువ గట్టుపై నిద్రించారు. సిఎం పర్యటనలో భాగంగా మదనపల్లి మిట్స్ కాలేజీ ఆవరణలో రైతు సదస్సు పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు.
*సభావేదిక, షామియానా ఏర్పాట్ల కోసం - 22 లక్షలు
*రైతులను తరలించేందుకు - రూ. 13 లక్షలు
*పోలీసు బందోబస్తు, భోజనాలు, విశ్రాంతి గృహాలు, అధికారుల సమీక్షా సమావేశంకు- రూ. 10 లక్షలు
*చంద్రబాబు బస చెసే స్థలాన్ని చవును చెయ్యడానికి- ఆరేడు లక్షల రూపాయలు పైనే
*మదనపల్లి పట్టణంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను - ఐదారు లక్షలు
*హెలికాప్టర్ ఖర్చులతో కలిపి ముఖ్యమంత్రి పర్యటనకు రూ. 60 లక్షల పైనే
అయినా నారా చంద్రబాబు నాయుడుగారికి ఇంకా ఎన్ని సార్లు చెబిత మారతారో ఏమో తెలియదు. దుబారా బాబూ పెట్టుబడుల కోసం పొలోమని విదేశాలకు వెళ్లడం కాదు.. ముందు పొదుపు నేర్చుకోండి అని విమర్శకులు సలహా ఇస్తున్నారు.
(Source: Prajashakthi)
//అభినవచారి//
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more