Man raped by three women in South Africa for his semen

33 year old young man gang raped by three women at gunpoint

South Africa, rape, reproduction, semen, Man raped by three women in South Africa, sexual offences, Man raped by three women at gunpoint , gang rape on man, womens, Three women kidnapped a 33-year-old man, World

young man gang raped by three women, Three women kidnapped a 33-year-old man at gunpoint and raped him when they pulled over in their black BMW to ask him for directions

జంబ లకిడి పంబ... యువకుడిపై గ్యాంగ్ రేప్

Posted: 05/09/2015 12:20 PM IST
33 year old young man gang raped by three women at gunpoint

ఇప్పటివరకు పురుషులు మాత్రమే సామూహిక అత్యచారాలకు పాల్పడుతూ.. ఆడవారికి తీరని మనోవేధనతో పాటు శారీరికంగానే వేధన మిగిల్చే మగవారు తస్మాత్ జాగ్రత్తా..! ఎందుకంటారా..? ఇపుడు స్త్రీలు కూడా సామూహిక అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో బెదిరంచి 33ఏళ్ల ఓ పురుషునిపై ముగ్గురు మహిళలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారి చూపమని తమ బిఎండబ్ల్యూ కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు ఈ దారుణానికి పాల్పడినట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. కారులోని ఓ మహిళ ఆ వ్యక్తితో మాట్లాడుతుండగానే మరో మహిళ అతని వెనకవైపు నుంచి వచ్చి కారులోకి తోసేసింది. అతడ్ని బలవంతంగా కిడ్నాప్ చేసిన మహిళలు, గౌటెంగ్ నగరానికి 500 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్లారు.

కారులోనే అతనిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలపాలైనప్పటికీ అతడ్ని వదలకుండా.. ఉత్తేజ పరిచే పానీయాన్ని బలవంతంగా తాగించారు. ఆ తర్వాత అతనిపై పలుమార్లు ముగ్గురు మహిళలు అత్యాచారానికి పాల్పడ్డారు. అతని నుంచి వచ్చిన వీర్యాన్ని ఓ చల్లని బాక్సులో సేకరించారు. ఇలా పలుమార్లు చేసిన అనంతరం అతడ్ని కారు నుంచి బయటికి తోసేసి మహిళలు పరారయ్యారు. గౌటెంగ్ నగరంలో ఇలాంటి దారుణ ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందిత మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape on men  womens  South Africa  rape  semen  World  

Other Articles