GHMC To start Own House Scheme soon in Hyderabad | Greater City Rent Issues

Ghmc own house scheme hyderabad greater city rent issues

Own house scheme, greater hyderabad, ghmc own house scheme, ghmc latest updates, hyderabad city, hyderabad rent house problems, own house problems, middle class families

GHMC Own House Scheme Hyderabad Greater City Rent Issues : GHMC to start own house scheme for those who don't have own houses in hyderabad city. Govt has to give green signal for this.

‘ఏం బాబు.. సొంతిల్లు కావాలా?’ అయితే అద్దె కట్టండి!

Posted: 05/09/2015 11:40 AM IST
Ghmc own house scheme hyderabad greater city rent issues

హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు లేకుండా జీవనం కొనసాగిస్తున్న వారందరికీ ఓ బంపరాఫర్! ఒకేసారి భారీ మొత్తం చెల్లించి ఇంటిని కొనుగోలు చేయలేని వారికోసం జీహెచ్ఎంసీ ఓ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘అద్దె చెల్లించండి.. కొన్నేళ్ల తర్వాత మీరే ఆ ఫ్లాటును సొంతం చేసుకోండి!’ అని జీహెచ్‌ఎంసీ ‘రియల్‌’ ఆఫర్ తీసుకువచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా ‘హైర్‌ అండ్‌ పర్చేజ్‌’ (అద్దె చెల్లించండి.. సొంతం చేసుకోండి) అనే పథకాన్ని ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే దీనిపై అడుగు ముందుకు వేయనున్నట్లు సమాచారం!

నగరంలో మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మిగులుతోంది. నెలనెలా అద్దెరూపంలో వేలకువేలు చెల్లిస్తున్నారు. ఎప్పటికీ అద్దె ఇల్లే గతి అవుతున్న వారిని ‘సొంతిటి’కి యజమానులను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా ‘గ్రేటర్‌’ పరిధిలో ఖాళీగా వున్న స్థలాల్లో బహుళ అంతస్తుల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మిస్తారు. దానికయ్యే ఖర్చునుబట్టి చెల్లించాల్సిన అద్దెను, చెల్లించాల్సిన కాలాన్ని జీహెచ్ఎంసీ నిర్ణయిస్తుంది. ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని వారందరూ జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన నిబంధనలను, నిర్ణీత డాక్యుమెంట్లకు అనుకూలంగా అంగీకరించిన వారికి ఈ ఫ్లాట్లను కేటాయిస్తారు. నిర్దిష్టకాలం అద్దె కట్టిన తర్వాత... ఫ్లాటు వారి సొంతమైపోతుంది. దీనిపై ఇంకా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని... సర్కారు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పక్కాగా పథకాన్ని రూపొందిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

కాగా, పేదలకు పక్కా గృహాలను ప్రస్తుతమున్నట్లుగా కాకుండా... ఆరంతస్తుల్లో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్‌లో 2 లక్షల ఇల్లు అవసరమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. గ్రేటర్‌లో స్థలాల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో... జీ+2 కాకుండా, ఎక్కువ అంతస్తులు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే.. ఇక సొంతిల్లులేని వారి కల త్వరలోనే నెరవేరనుందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghmc own house scheme  middle class families  greater hyderabad city  

Other Articles