students jac dharna outside central ministers venkaiah naidu house in delhi

Students jac stage dharna outside venkaiah house

students jac stage dharna outside venkaiah house, students jac protest, special status to AndhraPradesh, AndhraPradesh special status issue, union minister venkaiah naidu, AndhraPradesh, special status issue, dont politicalise special status issue,

union minister venkaiah naidu faces students jac protest outside his residence in delhi.

అ ప్రాజెక్టులన్నీ నా ఛలవే.. మరి ప్రత్యేక హోదా..? గురూజీ.

Posted: 05/08/2015 09:16 PM IST
Students jac stage dharna outside venkaiah house

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం తన పరిధిలోనిది కాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర హోం ప్రభుత్వ పరిశీలనలో వుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలోని వెంకయ్య నివాసం వద్ద శుక్రవారం విద్యార్థి జేఏసీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకో ప్రాజెక్టు వస్తుందంటే అందుకు కారణం తానేనని చెప్పుకున్నారు. కేంద్రంలో మంత్రిగా వున్నాను కాబట్టే.. తాను సంబంధింత శాఖలతో కలసి రాష్ట్రానికి ప్రాజెక్టులు తేగలుగుతున్నానని చెప్పుకోచ్చారు.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చినట్లు వెంకయ్య తెలిపారు. కేంద్రంలో తాను ఉండబట్టే తెలు రాష్ట్రాలకు నెలకు ఒక ప్రాజెక్ట్ వస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ సమయంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేశారని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అయితే ఇన్నీ చేస్తున్న కేంద్ర మంత్రివర్యులు రాష్ట్రానికి ప్రత్యే హోదాను ఎందుకు కల్పించలేకపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : venkaiah naidu  student jac dharna  special status  Andhra Pradesh  

Other Articles