RTC | Strike | Ap | Employees,

Ap govt plans to withdrawl the rtc employees strike

RTC, Strike, Ap, Employees,

ap govt plans to withdrawl the RTC employees strike. ap govt using all the weapons on rtc employees to start buses.

ఎలా.. ఎలా ఆర్టీసీ కార్మికులను దారికి తేవడం?

Posted: 05/08/2015 05:16 PM IST
Ap govt plans to withdrawl the rtc employees strike


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది. అందుకే ఆర్టీసీ కార్మికులను దారిలోకి తెచ్చేందుకు సామదానభేద దండోపాయలను ప్రయోగిస్తోంది. కుదిరితే హెచ్చరికలు లేదంటే బుజ్జగింపులు...ఆపై ఊరించే ఆఫర్లతో కార్మికులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్లాన్ వేస్తోంది. హెచ్చరికలు పనిచేయలేదు. బుజ్జగింపులు సరిపోలేదు. అందుకే ఆఫర్ల వల వేస్తోంది ఆర్టీసీ. ఏలాగైనా సరే కార్మికులను విధులకు హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. ఇప్పటికే పీకల్లోతూ అప్పులో ఉన్న ఆర్టీసీ .. సమ్మెతో మరింత నష్టపోతోంది. సమ్మె మరికొన్ని రోజులు కంటిన్యూ అయితే అది సంస్థ మనుగడకే ప్రమాదం. అందుకే అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది ఆర్టీసీ. రెగ్యులర్ ఉద్యోగులను దారిలోకి తెచ్చుకునేందుకు వారికి ఓ ఆఫర్ ను ఎరగా వేయాలని భావిస్తోంది ఆర్టీసీ . సమ్మె విరమించి విధులకు హాజరైతే వారిపై ఉన్న పాత కేసులన్నీ ఎత్తివేయాలనే యోచనలో ఉందంట యాజమాన్యం. ఆర్టీసీ డ్రైవర్లపై యాక్సిడెంట్స్, కండక్టర్లపై టికెట్ ఇష్యూయింగ్ సంబంధించిన చిన్న చిన్న కేసులు ఉంటాయి. వెంటనే విధుల్లో చేరితే ఈ కేసుల గొడవలేమీ లేకుండా చూస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ ఆర్టీసీ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇక తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ముందుకు వచ్చే వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ. సమ్మె సమంయంలో పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లకు భవిష్యత్తులో జరుగబోయే నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ ఇప్పటికే బంపర్ ఆఫర్ ఇచ్చింది . ఇది కాస్త వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. చాలా మంది ఔత్సాహికులు కాంట్రక్ట్ పద్ధితిలో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆఫర్లే కాదు ... ఉద్యోగులను దారిలోకి తెచ్చుకునేందుకు హెచ్చరికలు కూడా చేసింది ఆర్టీసీ. ప్రస్తుతం ఆర్టీసీలో 6 వేల మంది కాంట్రక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా వెంటనే విధుల్లోకి చేరకపోతే వారి స్థానాల్లో ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారని నియమిస్తామని స్పష్టం చేశారు . మొత్తానికి ఉద్యోగుల్ని దారిలోకి తెచ్చుకునేందుకు సామదానబేధదండోపాయాలన్ని ప్రయోగిస్తోంది ఆర్టీసీ. మరి వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Strike  Ap  Employees  

Other Articles