Eamcet and dsc exams will be conducted as per shedule says minisfer ganta

Rtc strike poses a challenge for ap government to conduct eamcet

Andhra pradesh eamcet exam, AP EAMCET -2015, engineering, ap eamcet, ganta srinivasa rao, RTc strike, andhra pradesh news, latest news, minister ganta srinivasa rao

rtc strike poses a challenge for students, but minister ganta srinivasa rao says Eamcet and dsc exams will be conducted as per shedule

అంతా షెడ్యూల్డ్ ప్రకారమే.. రాత్రిలోపు చేరుకుంటే మంచిది..

Posted: 05/07/2015 06:01 PM IST
Rtc strike poses a challenge for ap government to conduct eamcet

ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న ఎంసెట్-2015కు  అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మానవ  వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్తో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అయితే ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్, డీఎస్సీ పరీక్షలు  నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.

సుమారు 2.55 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్,  అగ్రికల్చరల్  తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్ హాజరవుతున్నట్లు తెలిపారు. 13 జిల్లాల్లో ప్రయివేట్ బస్సులను ఎంసెట్, డీఎస్సీ పరీక్షలకు ఉపయోగించాలని ఆదేశించామని, దీనిపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికులు పునరాలోచించాలని గంటా విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. వీలైతే విద్యార్థులు గురువారం రాత్రిలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 40 శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, అన్ని ప్రయివేట్ స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకుంటామని గంటా తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP EAMCET -2015  engineering  ap eamcet  ganta srinivasa rao  

Other Articles