Abhijeet |salmankhan | twitter

Dogs will die if they sleep on road says abhijeet

Abhijeet, salmankhan, twitter, hit and run, judgement,

Abhijeet has been aggressively tweeting his feelings about the #salmanKhancase since morning. However, his tone and language of tweets has raised a few eyebrows. He is on an insulting spree for the victims of Salman Khan hit-and-run case and is referring them to dogs. The singer feels the actor is not responsible for the death of the victim and that he must not be sleeping on the road.

అభిజీత్ ఎక్కువైంది.. రోడ్డు మీద పడుకుంటే కుక్కలు కూడా చస్తాయా?

Posted: 05/06/2015 05:21 PM IST
Dogs will die if they sleep on road says abhijeet

సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తు ముంబై సెషన్స్ కోర్ట్ వెల్లడించిన తీర్పుపై సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. చాలా మంది సినీ పెద్దలు సల్మాన్ ఖాన్ శిక్షపై స్పందించారు. అయితే అందులో ఎవరూ కోర్టు తీర్పును తప్పుపట్టలేదు. సల్మాన్ కు మాత్రం తక్కువ శిక్ష పడితే బాగుండేది అని బావించారు. అయితే ఓ సింగర్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, సల్మాన్ ఖాన్ మద్దతు దారుల్లో ఒకరైన అభిజీత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...రోడ్డు ఉన్నవి కార్లు మరియు కుక్కలు వెళ్లడానికే. మనుషులు పడుకోవడానికి కాదు. కుక్కలు రోడ్డుపై పడుకుంటే చస్తాయి. రోడ్లు ఉన్నది పేద వారి కోసం కాదు. నేను చాలా కాలం ఇళ్లు లేకుండా ఉన్నాను. అలా అని రోడ్లపై పడుకోలేదు అంటూ అభిజిత్ ట్వీట్ చేశారు.

అంతేనా రోడ్ల మీద పడుకుంటున్న వారికి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. రోడ్డు పక్కన పడుకోవాలనుకుంటే తమ ఊర్లకు వెళ్లి పడుకోండని కూడా అన్నారు. అయినా .ఇలా ముంబై లాంటి నగరాలకు వచ్చి పడుకోవద్దు. ఇక్కడ ఫుట్ పాత్ లు కట్టింది మీరు పడుకోవడానికి కాదు అని అభిజీత్ ట్వీట్ చేశారు. సూసైడ్ అనేది నేరం.. ఫుట్ పాత్ మీద పడుకోవడం కూడా ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే అని అభిజీత్ ట్వీట్ చెయ్యడం పై వివాదం రేగింది. అయితే సల్మాన్ కాన్ కు మద్దతుగా ఉండాలన్న అభిజీత్ కోరిక మంచిదే కానీ దానికి రోడ్డు మీద పుడుకోవద్దని, ఏకంగా కుక్కలు అదీ ఇదీ అని పోల్చడం ఏంటని కొందరు సినిమా పరిశ్రమలో 80 శాతం మంది కనీసం ఇల్లు కూడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ వారెవరూ ఎప్పుడూ ఫుట్ పాత్ మీద పడుకోలేదు  అంటూ సినిమా వాళ్ల గురించి ఓ రేంజ్ లో పొగిడేశాడు. అయినా అబిజీత్ వ్యాఖ్యలకు ఎవరికైనా చిర్రెత్తి కోర్టుకు వెళితే అప్పుడు తెలుస్తుందని కూడా కొందరు అనుకుంటున్నారు.

]abhijeet-tweets

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhijeet  salmankhan  twitter  hit and run  judgement  

Other Articles