China | Online | Python | Eggs

A person orders pythons eggs on online finally he got python eggs from africa

China, Online, Python, Eggs, net, Photos

a person orders pythons eggs on online. finally he got python eggs from africa. He kept those eggs in incubater. after some time smalls pythons from eggs. but he posted the photos of the small pythons in net. police arrested that man and jailed.

అయ్య బాబోయ్.. ఆన్ లైన్ లో కొండ చిలువ గుడ్లు ఆర్డరిచ్చాడు

Posted: 05/06/2015 04:50 PM IST
A person orders pythons eggs on online finally he got python eggs from africa

షాపింగ్.. ఆడవాళ్లకు హుషారు, మగవారికి బేజారు తెప్పించే పదం. అయితే ఒకప్పుడు ఏవైనా వస్తువులు కొనాలంటే పొలోమని సానింగ్ కాంప్లెక్స్ లు, పది షాప్ లు తిరిగే వారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.. ఎవరికీ అంత టైం లేదు, అంతకన్నా ఓపిక లేదు. అందుకే ఇంటి వద్దకే, ఆపీస్ వద్దకే ఆర్డరిచ్చిన వస్తువులు వచ్చేస్తున్నాయి. ఇ-కామర్స్ పుణ్యమా అని అనుకున్న వస్తువులు ఒక్క క్లిక్ దూరంలోనే ఉంటున్నాయి. అయితే ఈ మధ్య ఇ-కామర్స్ ను మన వాళ్లు అతిగా వాడుతున్నారు. ఎంతలా అంటే తమకు కావాల్సిన వస్తువులు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా ఆర్డరిచ్చి మరీ తెప్పించుకుంటున్నారు. అయితే ఓ ప్రబుద్దుడు ఏకంగా కొండ చిలువ గుడ్లను ఆర్డిరిచ్చి తెప్పించుకున్నాడు.. పాపం తరువాత మాత్రం కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..

ఎవరైనా ఇంటర్నెట్ లో ఏం ఆర్డరిస్తారు? డ్రెస్సులో, ఫోన్లో, షూలో, ఐప్యాడో లేదా మరోటో ఆర్డరిస్తాం. అయితే, చైనా కు చెందని ఓ వ్యక్తి తొమ్మిది కొండచిలువ గుడ్లు ఆర్డరిచ్చాడు. ఆర్డరివ్వడమే ఆలస్యం. మనోడికి వారంలోనే ఆఫ్రికా నుంచి కొరియర్ లో గుడ్లు ఇంటికొచ్చేశాయి. వాటిని ఇంక్యుబేటర్ లో పెట్టేసరకి.. గుడ్ల నుంచి కొండ చిలువ పిల్లలు బయిటికొచ్చేశాయ్. ఇంకేముంది.. వాటి ఫోటోలు తీసి ‘ మా ఇంట్లో కొండ చిలువ పిల్లలు పుట్టాయోచ్‘ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విషయం ఆనోటా ఈ నోటా పడి చివరికి ఆ వార్త పోలీసుల వరకు పోయింది. విదేశాల నుంచి అక్రమంగా కొండచిలువ గుడ్లు తెప్పించడంతో పోలీసులు అతడిని ఆరెస్ట్ చేశారు. 9 పిల్ల కొండచిలువలను అక్కడి జూ కు తరలించారు పోలీసులు. అయినా కొండ చిలువ గుడ్లు కొన్న వాడు ఊరికే ఉండక మళ్లీ నెట్ లో ఎందుకు ఫోటోలు పెట్టారు అంటూ కొంత మంది అంటున్నారు. అయినా ఓ సారి నెట్ కు అడిక్ట్ అయితే ఇలానే ఉంటుందేమో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Online  Python  Eggs  net  Photos  

Other Articles