MP Kavita Suggestions for TRS Party Minister To Cm Kcr Orders and Plans | Telangana State news

Mp kavita press meet trs party minister cm kcr special classes

mp kavita news, kavita updates, mp kavita statements, mp kavita controversy, mp kavita press meet, kcr news, kcr updates, kcr controversy, trs ministers, trs ministers meeting, kavita kcr photos, hussain sagar news

MP Kavita Press Meet TRS Party Minister Cm Kcr Special Classes : After Completed the Special Class of TRS Party Minister MP Kavita Talked About that matter with Media. She said that if minister will follow kcr rules then trs party will rule 20 years telangan state.

KCR ఆదేశాలు పాటిస్తే.. 20 ఏళ్ల అధికారం TRSదే!

Posted: 05/04/2015 06:44 PM IST
Mp kavita press meet trs party minister cm kcr special classes

టీఆర్ఎస్ పార్టీ నేతల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రంగాలపై, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై పూర్తి అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించారు. మూడరోజుల పాటు నాగార్జున సాగర్ లో జరిగిన ఈ తరగతులు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగానే ఎంపీ కవిత మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్తు ప్రణాళిక గురించి కేసీఆర్ దిశానిర్దేశం చేశారని ఆమె చెప్పారు.

ఈ నేపథ్యంలోనే కవిత చెబుతూ.. కేసీఆర్ సూచనలు, ఆదేశాలు పాటిస్తే మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ ఫార్టీనే అధికారంలో వుంటుందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రంగాలపై చర్చ జరిగిందని, మొత్తం కార్యక్రమం ఎంతో అద్భుతంగా సాగిందని ఆమె అన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ శిక్షణా తరగతుల వల్ల నేతలకు అనేక అంశాలపై అవగాహన పెరిగిందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అన్నివిధాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని.. దానిపై నేతలకు ఆయన అవగాహన కల్పించారని ఆమె అభిప్రాయం వెల్లడించారు.

టీఆర్ఎప్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల పథకాలతోపాటు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కాకతీయ మిషన్ కి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనుగుణంగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతుందని.. ఈ పార్టీ ఇలాగే 20 ఏళ్లు కొనసాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Kavita  KCR  TRS Party Meeting  

Other Articles