AP | Chandrababu | Tourism

Ap cm chandrababu naidu said that ap will get number one position in india

AP, Chandrababu, Tourism, Industry, Polavaram,

AP cm Chandrababu naidu said that ap will get number one position in india. Chandrababu clear that the govt will consider tourisam as industry.

దేశంలో ఏపిని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాం:చంద్రబాబు

Posted: 05/02/2015 07:59 AM IST
Ap cm chandrababu naidu said that ap will get number one position in india

ఏపిని దేశంలోనే నెంబర్ స్థానంలో నిలబెడతామని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ది చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చైనా, కొరియా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్‌ హబ్‌గా రూపొందుతుందని స్పష్టం చేశారు. పర్యాటకంగానూ, పారిశ్రామికంగానూ అన్నిరంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా నిలబెట్టేవరకు అహర్నిశలూ కష్టపడతా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ 70 కోట్లతో చేపట్టనున్న కాకినాడ బీచ్‌-హోప్‌ ఐలాండ్‌-కోనసీమ ఎకో టూరిజం సర్వ్యూట్‌ ప్రాజెక్టు పనులకు చంద్రబాబు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేసే ప్రక్రియలో మత్స్యకారుల ఉపాధికి ఆటంకంలేకుండా చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటకరంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

పోలవరాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తరలించి కరువు నివారిస్తామన్నారు. సముద్రంలోకి పోతున్న 3 వేల టీఎంసీలలో వెయ్యి టీఎంసీలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణ, అక్కడ నుంచి శ్రీశైలం మీదుగా రాయలసీమకు తరలిస్తున్నామన్నారు. 24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. త్వరలో డ్వాక్రా రుణమాఫీ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఏలేరు ఆధునికీకరణకు రూ 19 కోట్లు మంజూరుచేశామని పనులు త్వరగా పూర్తిచేయిస్తామన్నారు. కాకినాడలో రెండు పోర్టులు ఉన్నాయని, త్వరలో కేఎస్‌ఈజెడ్‌లో జీఎంఆర్‌ పోర్టు వస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటి వరకు సర్వీసుపోర్టుగా అనుమతులు ఉన్న ఎస్‌ఈజెడ్‌ పోర్టు కమర్షియల్‌ పోర్టుగా అనుమతులు ఇస్తామని ఆయన ప్రకటించారు. పోర్టుల అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని త్వరితగతిన అభివృద్ధిచేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నానన్నారు. త్వరలో కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, పెట్రోలియం వర్సిటీ ఏర్పాటుకానున్నాయన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu  Tourism  Industry  Polavaram  

Other Articles