China | Constructions | Skycity

Chinese builder constructed 57 story skyscraper in 19 days

China ,Constructions,Skycity

Chinese builder puts up 57-story skyscraper in 19 days A Chinese construction company is claiming to be the world's fastest builder after erecting a 57-story skyscraper in 19 working days in central China.

వారినీ.. 19 రోజుల్లో 57 అంతస్తులు కట్టేశారు

Posted: 05/01/2015 01:01 PM IST
Chinese builder constructed 57 story skyscraper in 19 days

మన పక్కింటి వాళ్లు ఇళ్లు కడుతుంటే అస్సలు కనిపించదు.. చూస్తుండగానే ఇళ్లు కట్టేస్తారు. అరే అస్సలు ఇంత తొందరగా కట్టేస్తారా అని ఆశ్చర్యపోతుంటాం. అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన వార్త ఉంది. అదేంటంటే చైనాలో కేవలం 19 పని రోజుల్లో 57 అంతస్తుల మిని స్కై సిటిని నిర్మించారు.  అవును నిజంగా కేవలం 19 రోజుల్లో అద్భుతాన్ని చేసి చూపించింది ఓ చైనా నిర్మాణ సంస్థ. అయితే ఈ స్కై సిటి నిర్మాణాన్ని రెండు విడతలుగా నిర్మించింది ఆ సంస్థ. దాదాపు 2,736 రకాల మోడల్స్ ను అనుకొని చివరకు ఓ మోడల్ కు ఓకే చెప్పి.. దాన్ని వేగంగా పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ అంత ఎలా సాధ్యం అయింది.. ఎక్కడ అన్న విషయాలు మీకోసం..

చైనా.. ప్రపంచంలో ఇన్ ఫ్రాస్టక్చర్ కు పేరుపొందింది. అక్కడ నిర్మాణరంగం ఎంతో వేగంగా అబివృద్ది చెందింది. అన్ని దేశాల కన్నా చైనా ఎంతో వేగంగా నిర్మా రంగంలో దూసుకెళుతోంది. అయితే చైనా కు చెందిన The Broad Sustainable Building Co. ప్రపంచంలో వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. అయితే Changsh సిటిలో అతి వేగంగా స్కై సిటిని నిర్మించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ నిర్మాణంలో స్టీల్, మెటల్ లను ఎక్కువగా వినయోగించారు. రోజుకు మూడు నుండి నాలుగు ఫ్లోర్లను నిర్మిస్తూ.. 19 రోజుల్లో 57 అంతస్తులను పూర్తి చేశారు.ఈ స్కై సిటిలో 800 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఈ నిర్మాణంలో మొదటి 20 అంతస్తులను గత సంవత్సరమే పూర్తి చెయ్యగా మిగిలిన నిర్మాణాన్నిఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకు పూర్తి చేశారు. పైగా భూకంపాలకు ఏ మాత్రం భయపడనవసరం లేకుండా అన్ని జాగ్రత్తలతో నిర్మాణాన్ని పూర్తి చేసింది నిర్మాణ సంస్థ. అంతేకాదు త్వరలోనే 220 ఫ్లోర్ల బిల్డింగ్ ను నిర్మించాలని అనుకుంటున్నామని.. అందుకు ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నామని The Broad Sustainable Building Co.ప్రతినిధులు తెలిపారు. మొత్తానికి చైనా కంపెనీ భలే రికార్డు, భలే స్కై సిటిని నిర్మించేసింది. వీలైతే అక్కడికెళ్లి చూడండి లేదంటే కనీసం ఫోటో చూసైనా సంతోషపడండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Constructions  Skycity  

Other Articles