tv artist asmitha upload eve teasers photos in social media

Two arrested for allegedly teasing a female television artiste

tv artist asmitha upload eve teasers photos in social media, tv artist asmitha, accused arrested, hyderabad she teams, female television artiste, eve teasers arrested,

tv artist asmitha upload eve teasers photos in social media and got accused arrested by hyderabad she teams

బుల్లితెర నటి అస్మితను వేదించిన పోకిరీలకు అరదండాలు..!

Posted: 04/30/2015 10:41 PM IST
Two arrested for allegedly teasing a female television artiste

తెలుగు టీవీ నటి అస్మిత కర్నానిని వేధిస్తూ, ఆమె కారును ఫాలో చేసిన కేసులో ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్రాన్ బిన్ మహ్మద్, సయ్యద్ నూరుల్లా హుస్సేని అనే ఇద్దరు ఆమె కారును ఓ బైకులో ఫాలో అవుతూ.. ఆమె దారిని అడ్డగించడమే కాక.. కారువైపు దూసుకొస్తూ, అసభ్యకరమైన చేష్టలు చేశారు. అస్మిత వెంటనే వాళ్లిద్దరినీ ఫొటో తీసి, దాన్ని 'షీటీం' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అప్పటికే నగరంలో తిరుగుతూ ఉన్న షీ టీం సభ్యులు ఆ ఫొటో, బైకు ఆధారంగా వాళ్లను వెంటనే అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా తెలిపారు. వాళ్లిద్దరి మీద పెట్టీకేసు పెట్టి.. తర్వాత విడిచిపెట్టినట్లు ఆమె చెప్పారు.

తనను వేధించిన పోకిరీలపై తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్పందించడం అభినందనీయమని అస్మిత అన్నారు. తనను వేధించిన ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్ అయ్యారన్న సంగతి మీడియా ద్వారానే తెలిసిందని మీడియాతో చెప్పారు. తనను వేధించిన పోకిరీలను తన కారులోంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశానని ఆమె వెల్లడించారు. అలాగే 'షీ' వెబ్ సైటులోనూ పెట్టానని చెప్పారు. అవేర్ నెస్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని అన్నారు. ఇంతకుముందు రెండుమూడు సార్లు పోకిరీల బారిన పడ్డానని అప్పుడు ఏమీ చేయలేకపోయానని వెల్లడించారు.

గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో బైకుపై వెళుతూ తనను వేధించిన ఇద్దరు ఆకతాయిల ఫోటోలు తీశానని వివరించారు. తాను ఫోటోలు తీస్తున్నానన్న భయం లేకుండా నవ్వుతూ ఫోజులు పెట్టారని, అందుకే వారి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టానని తెలిపారు. నిపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని అన్నారు. తమవైపు నుంచి కూడా తప్పు ఉందని వ్యాఖ్యానించారు. పోకిరీల బారిన పడుతున్న మహిళలు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అస్మిత సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asmitha  she teams website  social media  

Other Articles