Oppn protests over ayurveda med claiming birth of male child

Ramdev in trouble for son guaranteeing medicine

Rajya Sabha, Ramdev's Divya Pharmacy, Rsmdev baba, K C Tyagi, Putrajeevak Beej, jaya bachan, opposition, kc tyagi, jp nadda,. Baba Ramdev, Yoga guru, Haryana brand ambassador, Opposition demand, social discrimination,social issues (general), discrimination, politics

A demand to ban a purported ayurveda product by yoga guru Ramdev's Divya Pharmacy that promises a male child was made in Rajya Sabha today, with Opposition members terming it as illegal and unconstitutional and seeking stringent action against the manufacturers.

రాందేవ్ 'పుత్రజీవక్ బీజ్'పై రాజ్యసభలో రచ్చ

Posted: 04/30/2015 05:45 PM IST
Ramdev in trouble for son guaranteeing medicine

యోగా గురువు, హర్యానా బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ కు చెందిన దివ్యా ఫార్మసీ ఆయుర్వేద మెడిసిన్పై రాజ్యసభలో పెద్ద దుమారం రేగింది. యోగా గురు ఆధ్వర్యంలో రూపోందించిన 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మందులను వాడే వారికి ఖచ్చింతగా మగ సంతానం కలుగుతుందని తయారీ దారులు ప్రకటించడం వివాదానికి కారణమైంది. ఈ విషయమై రాజ్యసభలోని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి

అయితే, దీనిపై జేడీయు ఎంపీ కేసీ త్యాగి సభలో ఈ ప్యాకెట్ ను ప్రదర్శిస్తూ దీనిని తాను దివ్యా మెడిసిన్ షాపులో తెచ్చానని, మగ పిల్లలు పుడతారని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. నిజంగా దేశాన్ని ఒక డైనమిక్ నాయకుడు పాలిస్తున్నాడన్న విషయాన్ని ఈ అంశంలో రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆ ప్యాకెట్ ను తీసుకెళ్లి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అందజేశారు. దాని ఉత్పత్తిని వెంటనే నిలిపివేసి లైసెన్సు రద్దు చేయాలని కోరారు. దీనిపై కొంత చర్చ జరిగినా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికార పక్షం స్పీకర్తో ప్రకటన చేయించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : opposition  kc tyagi  jp nadda  ramdev  jaya bachan  

Other Articles