Sharat Pawar | Maharastra | BJP | Modi | Graph

National caongress party president sharath pawar commented on bjp

National Congres Party, Sharat Pawar, Maharastra, BJP, Modi, Graph

national Caongress Party president Sharath Pawar commented on bjp. He said that the graph of bjp party decreasing. BJP party got the power by naming Aache Din.

బిజెపి గ్రాఫ్ పడిపోతోంది అంటున్నాడు.. కానీ నిజమా.?

Posted: 04/30/2015 04:46 PM IST
National caongress party president sharath pawar commented on bjp

కేంద్రంలొ తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి పై ఓ సీనియర్ మంత్రి విమర్శలు చేశారు. గతంలో జతకడతారు అనుకున్న ఆయనే ఇప్పుడు బిజెపి పార్టీపై కారాలు, మిరియాలు నూరుతున్నాడు. అప్పుడు దోస్త్ మేరా దోస్త్ అని.. ఇప్పుడు మాత్రం పోతే పోనీలేరా.. అంటూ ట్యూన్ మారుస్తున్నాడు. అన్నట్లు ఆ నేత ఉన్నట్టుండి ఎకనామిస్టులా మారిపోయాడు. బిజెపి గ్రాఫ్ అమాంతం పడిపోతోంది అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా.. ఇంకెవరు మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరాద్ పవార్. అసలు స్టోరీ ఏంటంటే..

మహారాష్ట్ర ఎన్నికల్లో కనీసం ఒక్క మాట కూడా ఎన్సీపీ గురించి మాట్లాడలేదు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ పవార్ పై చూపిన అభిమానంతో మహారాష్ట్రలో, కేంద్రంలో ఎన్సీపీ, బిజెపిలు జత కడతాయని అనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరగలేదు. తరువాత శివసేన చేసిన కొన్ని వ్యాఖ్యలతో బిజెపి, శివసేన విడిపోతాయని, ఎన్సీపీ బిజెపితో పొత్తు కుదుర్చుకుంటుందని అనుకున్నా.. అది కూడా జరగలేదు. అయితే తాజాగా ఎన్సీపీ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్బిబిజెపిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది నెలల కిందట అచ్చే దిన్ పేరుతో అదికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ కనీసం ఏడాది గడవక ముందే ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోందని ఆయన అన్నారు. అయినా దోస్తీ ఉన్నప్పుడు ఒకలాగా.. అది చెడిననాడు మరోలా మాట్లాడటం ఈ రాజకీయ నేతలకు మామూలేగా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Congres Party  Sharat Pawar  Maharastra  BJP  Modi  Graph  

Other Articles