South Korea’s prime minister resigns after his name appears on a tycoon’s suicide note

South koreas prime minister resigns after his name appears on a tycoons suicide note

South Korea prime minister, Lee Wan-koo news, tycoons suicide note, former construction company, South Korea PM resigns, south korea suicide note

South Koreas prime minister resigns after his name appears on a tycoons suicide note : A suicide note has ended the political career of South Korea’s prime minister, Lee Wan Koo, in a widening scandal that is making a mockery of the government’s supposed crackdown on corruption.

ఆ వ్యక్తి ఆత్మహత్యకు ‘ప్రధానీ’యే కారణం! రాజీనామా చేసిన ప్రధాని

Posted: 04/29/2015 11:30 AM IST
South koreas prime minister resigns after his name appears on a tycoons suicide note

రాజభోగాలు అనుభవించిన ఆ వ్యక్తి జీవితంలో అనుకోకుండా కొన్ని పరిణామాలు ఎదురయ్యాయి. అప్పటికీ వాటిని ఎదుర్కునేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు కానీ.. ఫలితం లేకపోయింది. అతని ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయిన కొందరు దుర్మార్గులు.. అతనిని పూర్తిగా నాశనం చేసేంతవరకు కంకణం కట్టుకున్నారు. వీరితోపాటు ప్రధాని కూడా కుమ్మక్కయ్యాడట! దీంతో ఆ వ్యక్తి తనకు వీలైనంతవరకు వారి నిజస్వరూపాలను ప్రపంచానికి తెలియజేసేందుకు శక్తిమేర పోరాడాడు కానీ.. వారి బలం ముందు నిలబడలేకపోయాడు. దీంతో చేసేదేమీలేక ఆ వ్యక్తి బలవన్మరణానికి గురికావాల్సి వచ్చింది. పోతూపోతూ ఓ సూసైడ్ నోట్ కూడా రాసి వెళ్లాడు. అందులో.. తన ఆత్మహత్యకు సదరు దుర్మార్గులతోపాటు ప్రధాని కూడా కారణమని పేర్కొన్నాడు. అంతే! వెంటనే ఆ ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉదంతం దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియాలో సంగ్ వాన్ జోంగ్ అనే వ్యాపారవేత్త ఓ నిర్మాణ సంస్థను కొనసాగించేవాడు. కొన్నాళ్లపాటు ఆ సంస్థ మంచి లాభాలతో బాగానే కొనసాగింది. అయితే.. ఇతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు దుండగులు.. ఇతనిని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. అది సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ సంస్థ దీవాళా తీసింది. దీంతో ఆ సంస్థ అధినేత అయిన సంగ్ వాన్ జోంగ్ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొన్నటివరకు ఏ మచ్చలేకుండా బతికిన అతనికి కోర్టు నుంచి నోటీసులు రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంతే! ఆ బాధను దిగమింగుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు తనువు చాలించే ముందుకు ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో పూర్తిగా వివరించాడు. అలాగే.. తన ఆత్మహత్యకు ఎనిమిది మంది కారణమని.. వారిలో ఆ దేశ ప్రధాని లీవాన్ కూడా ఒకరని ఆ నోట్ లో పేర్కొన్నాడు. తన సంస్థ తరఫున ప్రధానితో సహా ఎనిమిది మందికి భారీగా లంచాలు ముట్టజెప్పినట్లుగా అతడు తెలిపాడు.

ఈ విషయం బయటకు రాగా.. కొరియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రధాని లీవాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. లీవాన్ మాత్రం ఆ సంస్థ నుంచి లంచం తీసుకోలేదని, ఆ సంస్థ అధినేత ఆత్మహత్యకూ, తనకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మరోవైపు నిరసనలు కూడా తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని లీవాన్ కి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామాను ఆ దేశ అధ్యక్షురాలు వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయింది. అటు ఈ కేసుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Korea Lee Wan-koo resigns  tycoons suicide note  

Other Articles