A Child Girl Burn another girl with kerosene because she lost the game

Child girl burn another girl with kerosene cheating game

Two girls, Kerosene, Gachakayala game, huzurnagar, child games, child crime news, nalgonda district

Child Girl Burn another girl with kerosene cheating game : In Nalgonda district a child girl burn another girl with kerosene because of lost the game with her.

బాలిక ప్రాణాల మీదకు తెచ్చిన ‘గచ్చకాయలాట’

Posted: 04/29/2015 10:58 AM IST
Child girl burn another girl with kerosene cheating game

సరదాకోసం ఆటలాడుకోవడం సహజమే! అయితే.. ఆ సరదా కాస్త మితిమీరితే మాత్రం ఎన్నో పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాలమీదకు కూడా తీసుకొచ్చే అవకాశముంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటననే తీసుకోవచ్చు. సమీప బంధువులైన ఇద్దరు బాలికలు సరదా కోసం ఆటలాడుకుంటుండగా.. అనుకోకుండా విభేదాలు చోటు చేసుకున్నాయి. అంతే! కోపంతో రగిలిన ఓ బాలిక కిరోసిన్ తెచ్చి మరో బాలికపై పోసి నిప్పంటించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో మంగళవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన 11 ఏళ్ల బాలిక వేసవి విడిదిగా తన అమ్మమ్మ గ్రామమైన బూరుగడ్డకు వచ్చింది. అక్కడే సమీప బంధువువైన ఎనిమిదేళ్ల బాలికతో స్నేహంగా ఉంటోంది. ఇంటిల్లిపాది వ్యవసాయ పనికి వెళ్తుండడంతో ఆ ఇద్దరు బాలికలు కలిసి ఆడుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఇరు కుటుంబాలవారు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు బాలికలు ఇంటి దగ్గరే గచ్చకాయల ఆట ఆడారు. ఈ ఆటలో భాగంగానే ఓ దశలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక గెలిచింది. అయితే.. ఈమె గెలుపును ఆ మరో బాలిక జీర్ణించుకోలేకపోయింది. దీంతో ‘లేదు.. లేదు నేనే గెలిచా.. నువ్వు తొండి చేశావు’ అంటూ ఆ బాలిక తగాదా పెట్టుకుంది.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఓడిపోయిన బాలిక ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. పక్క ఇంట్లో ఓ బాటిల్‌లో ఉన్న కిరోసిన్‌ను తెచ్చి మరో బాలికపై పోసింది. అగ్గిపెట్టె గీసి అంటించింది. ఇక అక్కడి నుంచి వెంటనే ఇంటికి పరుగుతీసింది. మంటలకు తాళలేక ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలతో ఓ బాలిక ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం సృష్టించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Two Girls Crime  nalgonda district  Gachakayala game  

Other Articles