Killi Kruparani, Bheemili | Police | Case | Rammohan Rao

Bheemili police filed a case on ex central ministerkilli kruparani husband

Killi Kruparani, Bheemili, Police, Case, Rammohan Rao,

Bheemili police filed a case on ex central ministerkilli kruparani husband. Dr. Rammohan Rao attacked on nighbour suguna and watchman for some economic litigations.

మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్తపై కేసు.. కిడ్నాప్ కు ప్రయత్నం..?

Posted: 04/29/2015 08:49 AM IST
Bheemili police filed a case on ex central ministerkilli kruparani husband

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహనరావుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బు లావాదేవీల విషయంలో చంపుతానని బెదిరించడంతో ఆయనపై భీమిలికి చెందిన ఓ వైద్యుని భార్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమిలి పోలీసుల కథనం ప్రకారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహనరావు(శ్రీకాకుళం) భీమిలి ఎస్.ఒ.ఎస్.చిల్డ్రన్స్ విలేజ్ సమీపంలో ఉంటున్న డాక్టర్ ఎన్ .ఎల్.రావు స్నేహితులు.  రామ్మోహనరావు మధురవాడ సమీపంలో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల డాక్టర్ ఎన్.ఎల్.రావుకు రూ.23లక్షలు ఇచ్చారు. ఆపని జరగక పోవడంతో అందులోని రూ.20లక్షలు ఎన్.ఎల్.రావు తిరిగి ఇచ్చేయగా మూడులక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం రామ్మోహనరావు కారులో డ్రైవర్ ధనుంజయ్‌తో మంగళవారం మధ్యాహ్నం ఎన్.ఎల్.రావు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో వారు మద్యంసేవించి ఉన్నారు. ఎన్.ఎల్.రావు ఇంట్లో  లేరు. ఆయన భార్య ఎన్.సుగుణ, వాచ్‌మన్ మహలక్ష్మినాయుడు ఉన్నారు.

ఆర్ధిక లావాదేవీల కారణంగా రామ్మోహనరావు డాక్టర్‌ ఇంటిపై దాడి చేశారని, అక్కడే ఉన్న డాక్టర్‌ భార్య సుగుణను, వాచ్‌మెన్‌ మహాలక్ష్మీనాయుడును కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారని డాక్టర్‌ సతీమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాచ్‌మెన్‌ మహాలక్ష్మినాయుడుని ఎర్రమట్టి దిబ్బల వరకు తీసుకువెళ్లి రామ్మోహనరావు డ్రైవర్‌ ధనుంజయ్‌ కొట్టి పడేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహనరావు, ఆయన డ్రైవర్‌ ధనుంజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదం కారణమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి ఎస్‌ఐ అప్పారావు చెప్పారు.మరి ఘటనపై పోలీసులు నిజాలను వెలికితీయాల్సి ఉంది.

(Photo from Anhdra prabha news paper)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Killi Kruparani  Bheemili  Police  Case  Rammohan Rao  

Other Articles