Bihar | Janata Pariwar | Nitest kumar | Lalu prasad yadav | Mulayam,

Clashesh between the janata pariwar partys for bihar elections

bihar, Janata Pariwar, nitest kumar, Lalu prasad yadav, Mulayam, Samagvadi party, BJP, NDA

Clashesh between the janata Pariwar partys for bihar elections. janata paiwar alliance getting starting troubles. Nitesh kumar and lalu prasad yadav clashesh for bihar seats. lalu prasad demanding hundred seats in the bihar elections.

దోస్తీ అన్నారు దెబ్బలాడుకుంటున్నారు.. జనతా పరి'వార్'

Posted: 04/28/2015 11:04 AM IST
Clashesh between the janata pariwar partys for bihar elections

దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం అంటూ పాటలు పాడి ఉశారుగా ఉరలేసిన జనతా పరివార్ లో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. జనతా పరివార్ గతంలో లాగా ఉండదు ఈ సారి అందరం చివరి దాకా కలిసే ఉంటామని పలికిన మన నేతాగణం మాటలు గాలిలో కలిసిపోయాయి. బీజెపిని అడ్డుకోవాలన్న ధ్యేయంతో ఆరు పార్టీలు జనతా పరివార్ పేరుతో కూటమిగా ఏకమయ్యాయి.అయితే పార్టీలు ఎక్కువ అయినా కొద్ది లేని తలనొప్పులు రావడం.. నాయకుల మధ్య విభేదాలు రావడం మామూలే. కానీ గతంలో దోస్తీ చేసి చెడిపోయి.. మళ్లి కలిసిన పాత మిత్రుల మధ్య అదే పాత గొడవలు వస్తున్నాయి. పార్టీల పరంగా ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలన్ని విషయంలో వచ్చిన విభేదాలు జనతా పరివార్ లో చీలకకు దారితీస్తున్నాయి.

త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కూటాయింపుల్లో పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ల మధ్య సీట్ల వివాదం రాజుకుంది. గతంలో జనతా పరివార్ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేసిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ల మధ్యే విభేదాలు రావడంతో జజతా పరివార్ కూటమిలో అప్పుడే అనుమానాలు కలుగుతున్నాయి. తమకు 100కు పైగా సీట్లు కావాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేస్తుండగా, గత ఎన్నికల్లో కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకున్న నేపథ్యంలో అన్ని సీట్లు ఎలా కేటాయిస్తామని నితీష్ కుమార్ మండిపడుతున్నారు. మరి కొత్తగా కాపురం పెట్టి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే విడాకులు అన్న చందంగా తయారైంది జనతా పరివార్ పరిస్థితి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం జనతా పరివార్ మళ్లీ చరిత్రలో కలిసిపోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  Janata Pariwar  nitest kumar  Lalu prasad yadav  Mulayam  Samagvadi party  BJP  NDA  

Other Articles