Narachandrababu | Elections | Resignation | Telangna

Nara chadrababu naidu challenges to trs party chandrababu naidu

Nara chandrababu naidu, ap, telugudesamparty, TDP, TRS, Chandrashekar rao, Telangana, resignation, elections,

Nara chadrababu naidu challenges to TRS party chandrababu naidu. Chandrababu naidu slamedon the TDP MLAs joined in trs party.

రాజీనామాలు చేయించు.. ఎన్నికలకు పోదాం.. సత్తా ఏంటో తేలుతుంది

Posted: 04/28/2015 07:53 AM IST
Nara chadrababu naidu challenges to trs party chandrababu naidu

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వస్తే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారని పరోక్షంగా టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. తాము  సిద్ధంగా ఉన్నామని.. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు. ఎన్టీఆర్‌ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు.. ఇప్పుడు బయటకు వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారని చంద్రబాబు తెలిపారు. తన దగ్గర పని చేసి, ట్రస్ట్‌ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నీకిక్కడేం పని అని అంటున్నారని... వారి మాటలు తన మనసుకు బాధ కలిగిస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలతో కార్యకర్తలతో ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు అని నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బాధ కలిగేలా ఉన్నాయని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తాను ఇక్కడ ఉన్నానని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని తీరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి అంతా టీడీపీ పుణ్యమేనని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. గుజరాత్‌ తర్వాత తెలంగాణే మిగులు బడ్జెట్‌ రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని, దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమేని చెప్పారు. తాము రక్షించిన సంపదను వైఎస్‌ హయాంలో తెగనమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. చేసింది చెబుదాం. ప్రజల్లోకి వెళదాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు హితవు పలికారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara chandrababu naidu  ap  telugudesamparty  TDP  TRS  Chandrashekar rao  Telangana  resignation  elections  

Other Articles