గూగుల్.. పేరు వినని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ప్రపంచాన్ని చేతి వేలి దగ్గరికి తీసుకువచ్చిన అరుదైన ఆవిష్కరణల్లో ఒకటి. తాజాగా టెలికాం సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు ‘గూగుల్’ శ్రీకారం చుట్టింది. ‘ప్రాజెక్టు ఫై’ పేరుతో కంపెనీ సొంతంగా ప్రారంభించిన ఈ మొబైల్ ఫోన్ నెట్వర్క్.. అంతర్జాతీయ మొబైల్ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తోంది. బుధవారం నుంచే గూగుల్ అమెరికాలో ఈ టెలికాం సేవలు ప్రారంభించింది. అమెరికాలోని స్ర్పింట్ కార్పొరేషన్, టి-మొబైల్ నెట్‌వర్క్‌కు చెందిన మౌలిక సదుపాయాల ద్వారానే గూగుల్ ‘ప్రాజెక్టు ఫై’ ప్రారంభించడం విశేషం. దీంతో ఈ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ టవర్లతో పాటు దాదాపు 10 లక్షల వైఫై హాట్స్పాట్ల పరిధిలో ‘నెక్సెస్ 6’ ఫోన్ ఉన్న యూజర్లు గూగుల్ టెలికాం సేవలు పొంద వచ్చు. ఎలాంటి రోమింగ్ ఛార్జీలు లేకుండా 120 దేశాల్లో ఈ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ప్రాజెక్టు ఫై కనెక్షన్ తీసుకున్న ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ నుంచే చౌకగా మొబైల్ కాల్స్‌తో పాటు టెక్స్ట్ మెసేజ్‌లూ పంపుకోవచ్చు. స్కైప్ లాంటి యాప్స్ ద్వారానూ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుతూ వైఫై కవరేజి ప్రాంతం నుంచి బయట పడినా, మీ ఫోన్ కాల్ క్షణం కూడా కట్ కాదు. వెంటనే ఆ ప్రాంతంలో ఉండే సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌కు మీ కాల్ బదిలీ అవుతుంది. తద్వారా మీరు హాయిగా మొబైల్లో మాట్లాడుతూనే ఉండవచ్చు.
ఇన్ని సౌలభ్యాలున్న ప్రాజెక్టు ఫై కనెక్షన్‌ను గూగుల్ మిగతా టెలికాం ఆపరేటర్ల కంటే చౌకగా అందిస్తోంది. అమెరికాలో ఎటి అండ్ టి, వెరిజోన్ వంటి టెలికాం ఆపరేటర్లు ఫోన్ కాల్స్, మొబైల్ డాటా కోసం కోసం ప్రస్తుతం నెలకు 100 డాలర్ల (సుమారు రూ.6,300)వరకు వసూలు చేస్తున్నాయి. గూగూల్ మాత్రం తన ప్రాజెక్టు ఫై నెట్వర్క్ ద్వారా నెలకు 20 డాలర్లకే బేసి క్ వాయిస్, టెక్స్ట్ సర్వీసులు అందిస్తోంది. ఒక గిగాబైట్ డాటా సేవల ఛార్జీని కూడా 10 డాలర్లుగా నిర్ణయించింది. అది కూడా ఉపయోగించుకున్న డాటాకు మాత్రమే ఛార్జి వసూలు చేస్తోంది. ఎవరైనా ఖాతాదారుడు మూడు గిగా బైట్ల డాటా కోసం 30 డాలర్ల నగదు చెల్లించి 1.4 జిబి మాత్రమే ఉపయోగించుకుంటే అతడికి మిగతా 16 డాలర్లు ఇచ్చేస్తానని ప్రకటించింది. అమెరికా మిగతా టెలికాం ఆపరేటర్లు మాత్రం ప్రస్తుతం ఉపయోగించుకోని డాటాకు సంబంధించిన నగదును వెనక్కి ఇవ్వకుండా మరుసటి నెలకు బదిలీ చేస్తున్నాయి. ఈ ఆఫర్లతో గూగుల్ ప్రపంచ టెలికాం రంగంలో పెద్ద కుదుపు తీసుకు రావడం ఖాయమని భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో భారత్‌తో సహా ఇతర దేశాల్లోనూ గూగుల్ తన ప్రాజెక్టు ఫై సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more