3 Mumbai cops held for raping model | Sakinaka police chowkie

Mumbai model raped by 3 policemen inside sakinaka police chowkie

Mumbai Model GangRaped by Policemen, model gangraped inside Sakinaka police chowkie, Mumbai cops held for raping model, Sakinaka cops extorted Rs 4.5 lakh from model, two assistant inspectors and constable raped model, victim fled city after assult, Mumbai Police Commissioner Rakesh Maria

The officers from Sakinaka police station even extorted Rs 4.5 lakh in cash and gold from the woman and her boyfriend; the survivor had fled the city in fear after the crime on April 3, but gathered the courage to complain to the police chief this week; two assistant inspectors and a constable were arrested yesterday

ముంబాయి మోడల్ పై ‘కాకీ’ల కీచకపర్వం..

Posted: 04/24/2015 01:59 PM IST
Mumbai model raped by 3 policemen inside sakinaka police chowkie

కంచే చేను మేసిన చందంగా.. రక్షక భటులు భక్షక భటులుగా మారారు. ప్రజల అర్తనాధాలు పెట్టకుండా శాంతిభద్రతలను కాపాడాల్సిన కాకీలు.. కండకావరంతో వ్యవహరించి.. ఓ మోడల్ పట్ల సభ్యసమాజం తలదించుకునే విధంగా పోలీస్ స్టేషన్ లోనే అమెపై సామూహీక అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా.. సదరు మోడల్ ను పోలిస్ స్టేషన్ నుంచి కేసు లేకుండా వదిలిపెట్టాలంటే డబ్బు కావాలంటూ.. నాలుగున్నర లక్షల రూపాయాల మేర డబ్బు, బంగారం అభరణాలను వసూలు చేశారు. ఈ ఘటనతో బిత్తరపోయిన మోబల్.. ముంబాయి నగరాన్ని వదిలి వెళ్లిపోయిందంటే.. పోలీసుల చిత్రహింసలు ఎంత దారుణంగా వున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కాకీల కీచకపర్వంలో ఒక మహిళా అధికారి సహా ఆరుగురు పోలీసులు అరెస్టయ్యారు.

తూర్పు ముంబై ప్రాంతంలోని సకినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సినిమాలో చాన్స్ రావడంతో ఆఢిషన్స్ కోసం ఓ సార్ట్ హోటల్కు వెళ్లి తిరిగొస్తున్న 29 ఏళ్ల మోడల్ను.. అడ్డగించిన పోలీసులు సినీమా పోలీసులకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. దురుసుగా వ్యవహరించారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఏఎస్ ఐలు సూర్యవంశి, కతాపే, కానిస్టేబుల్ కొడే అటకాయించారు. తమతో రాకుంటే తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేస్తామని బెదిరించి, బలవంతంగా జీప్ ఎక్కించుకున్నారు.

ఏంఐడీసీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపారు. పైగా ఎలాంటి నేరం చేయని బాధితురాలిని.. కేసు లేకుండా విడిపెట్టాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అమె తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో.. అనేక ఏటీయంల చుట్టూ తిరిగిన ఆతను.. కొంత డబ్బును, మరికోంత బంగారు ఆభరణాల రూపంలో మొత్తం పోలీసులు డిమాండ్ చేసిన 4.5 లక్షల రూపాయలను తెప్పించి వారికి ఇచ్చింది. ఈ దోపిడీ పర్వంలో ఆ ముగ్గురు కీచకులకు మరో పోలీసు, ఓ మహిళ కూడా సహాయపడినట్లు తెలిసింది.

ఈ దారుణం తర్వాత ప్రాణభయంతో దేశం విడిచివెళ్లిన మోడల్.. ముంబైలోనే వుంటే.. పోలీసులు వేధింపులు అధికమువుతాయని భావించింది. తనకు జరిగిన పరాభవాన్ని ఎవరితో చెప్పుకునేందుకు కూడా ఇష్టపడిని అమె విదేశాలకు వెళ్లిపోయింది. అయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రోత్సహించడంతో ధైర్యాన్ని కూడగట్టుకుని ఎట్టకేలకు ముంబాయి పోలిస్ కమీషనర్ రాకేష్ మారియాకు ఎస్సెమ్మెస్ రూపంలో ఓ సందేశాన్ని పంపింది. తనపై .జరిగిన అకృత్యాన్ని గురించి ఫిర్యాదుచేసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రాకేశ్ మారియా.. అమెను నేరుగా తన కార్యాలయానికి రమ్మని పిలిచి.. అమెతో మాట్లాడి తనకు జరిగిన దారుణ ఘటనపై పిర్యాదు స్వీకరించి.. నిందితుల్ని అరెస్టు చేసి.. జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అయితే నేరాన్ని చేయడంతో పాటు ప్రోత్సహించడం కూడా నేరంగానే పరిగణించాలన్న సూక్తిని మరిచిన పోలీసులు ఆరుగురు పోలీసులకు బదులు కేవలం అత్యాచారానికి పాల్పడిన ముగ్గిరిపైనే చర్యలు తీసుకోవడం కోసమెరుపు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai model  gang raped  sakinaka police chowkie  

Other Articles