Parliament | farmers | Suicide | AAP

Parliament got heat on farmer suicide at aap rally

parliament, aap, rally, suiceide, farmer, exgratia, modi, venkiah, rajnathy singh

Parliament got heat On farmer suicide at aap rally. Yesterday aap rally got tears on suicide of a farmer. Venkiah naidu, rajnath singh and pm narendra modi respond on farmers suicide.

రైతు ఆత్మహత్యపై పార్లమెంట్ లో దుమ్ము దుమారం

Posted: 04/23/2015 04:20 PM IST
Parliament got heat on farmer suicide at aap rally

దిల్లీలో ఆప్ చేసిన ర్యాలీలో యువ రైతు ఆత్మహత్య పార్లమెంట్ లో దుమారం రేపింది. పార్లమెంట్ లో  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. అయితే పార్లమెంట్ లో ప్రభుత్వం తరఫున వెంకయ్య నాయుడు, రాజ్ నాధ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వెంకయ్య నాయుడు అయితే రైతు ఆత్మహత్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి అంటూ ఏకంగా చేతు జోడించి వేడుకున్నారు. వెంకయ్య నాయుడు చేతులు జోడించడంతో పార్లమెంట్ లో కాసేపు స్తబ్దత నెలకొంది. తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానంపై మండిపడ్డాయి. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేశారు. అయితే రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వంపై విమర్శలకు దిగడం తర్వాత ప్రభుత్వం దానిపై స్పందించడం మానేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందరం కలిసి రైతుల సమస్యలపై ఆలోచిద్దామని హితవు పలికారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ర్యాలీ పార్టీని కొత్త వివాదాలకు లాగింది. ఆప్ చేపట్టిన ర్యాలీలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకోవడంపై దుమారం రేగుతోంది. ఆప్ ర్యాలీలో యువరైతు ఆత్మహత్యపై పార్లమెంట్ చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు స్పీకర్ ను కోరాయి. అయితే ఆప్ ర్యాలీలో ఆప్ నేతలు, కార్యకర్తలు చేసిన అతి వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆప్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే రైతు ఆత్మహత్యకు కారణం ఎన్డీయే విధానాలేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆప్ నేతల వైఖరిని తప్పుపట్టారు. ర్యాలీలో భావోద్వేగాలు కలిగేలా ఆప్ నేతలు వ్యవహరించారని అన్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న  రైతు కుటుంబానికి ఆప్ రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ నేత సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఎదురుగా ఉన్నా కాపాడలేకపోయారని ఆప్‌ని మీడియా తప్పు పడుతోందని, అయితే ఏం జరిగిందన్న విషయం మీడియా కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యిందని ఆయన తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament  aap  rally  suiceide  farmer  exgratia  modi  venkiah  rajnathy singh  

Other Articles