Telnagana | Jagadeshwar reddy | Hyderabad | Handicap

Telangana minister jagadeshwar reddy fire on a physical handicaped person that she came to hyderabad solve her problem

Telangana, physically handicaped, jagadeshwar reddy, ktr, secretariate, hyderabad

Telangana minister jagadeshwar reddy fire on a physical handicaped person that she came to hyderabad solve her problem. Telangana minister jagadishwar reddy disappoinment words on that PH person.

ITEMVIDEOS:గిదేంది మంత్రీ.. అస్సల్ మంచిగ లేదు

Posted: 04/21/2015 03:47 PM IST
Telangana minister jagadeshwar reddy fire on a physical handicaped person that she came to hyderabad solve her problem

తెలంగాణ మంత్రిగారు చేసిన నిర్వాకం ఇప్పుడు అందరి నుండి విమర్శలు కురిపిస్తోంది. ఇంతకీ ఎందుకు అలా అంటే వికలాంగురాలు వినతి చేసుకుందామని అనుకుంటే మంత్రి గారు దాన్ని ఎంతలా విమర్శించారంటే.. ప్రతి దానికి హైదరాబాద్ కు రావడం ఫ్యాఫనైపోయింది అని విసక్కున్నారు. ఇప్పుడు ఇదే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంత్రి గారు వినతి తీసుకుంటారని అనుకుంటే మీద నుండి నాలుగు దండకాలు చదివెయ్యడం అక్కడున్న వారందరికి ఆశ్చర్యం కలిగించింది. మరి అసలు ఎక్కడ జరిగింది.. ఎవరా మంత్రి. ఎవరా బాధితురాలు.. వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఆర్వీఎం ఉద్యోగిని అయిన రమాదేవి అనే మహిళ.. పై అధికారులు తనను వేధిస్తున్నారని, అనవసరంగా బదిలీ చేసేందుకు యత్నిస్తున్నారని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సోమవారం పడుతూలేస్తూ సచివాలయానికి వచ్చింది. ఆమె ముఖ్యమంత్రి బ్లాక్‌ వద్దకు చేరుకునేసరికి మంత్రి కేటీఆర్‌ అటుగా వచ్చారు. దీంతో ఆమె తన సమస్యను ఆయనకు వివరించింది. ఆయన పక్కనే ఉన్న మంత్రి జగదీశ్‌ రెడ్డిని పిలిచి.. ‘‘మీ జిల్లాకు చెందిన ఆమెకు ఏదో సమస్య ఉందట’’ అని చెప్పారు.

‘‘సమస్య ఉంటే అక్కడే చెప్పాలిగానీ, ఇక్కడకు వచ్చి ఎందుకు విసిగిస్తున్నావు? ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చెయ్యి. ఇక్కడకు రావద్దు.. మమ్మల్ని విసిగించొద్దు. ప్రతిదానికీ హైదరాబాద్‌ రావడం పెద్ద ఫ్యాషన్‌ అయిపోయింది’’.. పై అధికారుల వేధింపులతో సతమతమవుతూ ముఖ్యమంత్రికి తన గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన ఓ వికలాంగ ఉద్యోగినిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తే సాయంచేయాలి లేదంటే కనీసం ఊరుకోవాలి అంతేతప్ప ఓ వికలాంగురాలిపై మంత్రి అంత పరుషంగా మాట్లాడటమేంటని అక్కడున్న వారంతా అనుకున్నారట. అయినా మంత్రి గారికి ఎందుకు కోపం వచ్చిందో మరి..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  physically handicaped  jagadeshwar reddy  ktr  secretariate  hyderabad  

Other Articles