AAP | Dismissed | Prashanth bhushan | Yogender yadav.

Aam admi party dismissed prashanth bhushan yogender yadav

aap, aam admi party, kejriwal, prashanth bhushan, yogender yadav

Aam admi party dismissed prashanth bhushan, yogender yadav. Aap party leaders prashanth bhushan, yogender yadav oppose to continueing kejriwal as delhi cm, as well as aap convenor.

ఆ ఇద్దరిపై ఆప్ వేటు వేసింది

Posted: 04/21/2015 12:02 PM IST
Aam admi party dismissed prashanth bhushan yogender yadav

దేశంలొ సంచనాలకు కేంద్ర బిందువుగా మారిప ఆప్ లో వివాదాలకు వేదికైంది. గత కొంత కాలంగా పార్టీలో చోటచేసుకున్న పరిణామాలు పార్టీకి చెడ్డ పేరుతెచ్చాయి. పార్టీ కన్వీనర్ పై ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు తిరుబాటు బావుటాను ఎగవేశారు. అయితే కేజ్రీవాల్ కన్వీనర్ గా, ఢిల్లీ సిఎం గా రెండు పదవులను నిర్వహించడానికి వీలులేదని  ప్రశాంత్ భూఫణ్, యోగేంద్ర యాదవ్ లు రాసిన బహిరంగ లేఖలు కూడా పార్టీలో దుమారాన్నే రేపాయి.

మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ అసమ్మతి నేతలు యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌లపై బహిష్కరణ వేటు పడింది. వీరితోపాటు మరో ఇద్దరు నేతలు ఆనంద్‌కుమార్, అజిత్‌ఝాలనూ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆప్ క్రమశిక్షణ కమిటీ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను జారీచేసిన షోకాజ్ నోటీసుకు సోమవారం వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వారిని పార్టీ నుంచి బహిష్కరించామని ఆప్ అధికార ప్రతినిధి దీపక్‌బాజ్‌పాయ్ తెలిపారు. కాగా అంతకుముందు షోకాజ్ నోటీసుపై యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌లు తీవ్రంగా స్పందించారు. క్రమశిక్షణ కమిటీయే అక్రమమని యోగేంద్ర అన్నారు. ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. క్రమశిక్షణ కమిటీలోని ఇద్దరు సభ్యులు అవినీతిపరులేనని ఆరోపించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  aam admi party  kejriwal  prashanth bhushan  yogender yadav  

Other Articles