Rahulgandhi | Landpooling | Congress | rally

Rahul gandhi promise to faremers for fight on land acquisiation bill

Rahul gandhi, Farmers, modi, congress, land pooling,

Rahul gandhi promise to faremers for fight on land acquisiation bill. Narendra modi Govt trying to get landpooling bill. Rahul gave assurance to fermers who met him at newdelhi.

భూసేకరణపై మాటల తూటాలు పేలుస్తా: రాహుల్ గాంధీ

Posted: 04/19/2015 12:01 PM IST
Rahul gandhi promise to faremers for fight on land acquisiation bill

వివాదాస్పద భూసేకరణ బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పట్టుదలగా ఉద్యమం నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తనను కలిసిన రైతు ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ బిల్లును ఉపసంహరించుకులేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం స్థానంలో మరో చట్టం అవసరం లేదని ఆయన అన్నారు. భూసేకరణ బిల్లు, పంటలకు గిట్టుబాటు ధర, అకాల వర్షాల కారణంగా పంటల నష్టం తదితర అంశాలపై రాహుల్‌ రైతులను అడిగి తెలుసుకున్నారు. రెండ విడతలుగా ఆయన రైతులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ఆద్వర్యంలోనిర్వహించనున్న రైతు ర్యాలీకి సన్నాహకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో రాహుల్‌ గాంధీ ఈ సమావేశాలు నిర్వహించారు. రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో ఆయన భూసేకరణ బిల్లుపై ప్రత్యేకంగా చర్చించారు. 2011లో రాహుల్‌ పాదయాత్ర ప్రారంభించిన బట్ట పర్సల్‌ గ్రామం నుంచి కూడా రైతులు రాహుల్‌తో భేటీ అయ్యేందుకు వచ్చారు. బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లులోని రైతు వ్యతిరేక అంశాలపై ఆయన వ్యవసాయ దారుల నుంచి సమాచారం సేకరించారు. బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త చట్టం రైతాంగ వ్యతిరేక మైందని, అది కార్పోరేట్‌ సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టేందుకు ఉద్దేశించిందని కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై తాను మాట్లాడ్తానని రాహుల్‌ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడతానని ఆయన పేర్కొన్నారు. హరియానాలోని భివానీ గ్రామం నుంచి వచ్చిన రైతులు ఆయనను 'చౌదరి రాహుల్‌జీ' అని సంబోధించారు. కొంతమంది రైతులు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట మొక్కలను ఆయనకు చూపించారు. రైతుల సమావేశం అనంతరం రాహుల్‌ తన ఇంటి ఎదుట తన కోసం వేచి ఉన్న రైతులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సమావే శాల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌ కామత్‌, రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్‌, యూపీసీసీ చీఫ్‌ నిర్మల్‌ ఖాత్రీ, ఏఐసీసీ షెడ్యూల్‌ కులాల విభాగం చైర్మన్‌ కొప్పుల రాజు తదితరులు పాల్గన్నారు. శనివారం రైతుల సమస్యలను తెలుసుకున్న రాహుల్‌ ఆదివారం రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో వివరిస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి షకీల్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. వాస్తవానికి వ్యవసాయదారులతో రాహుల్‌ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం భూసేకరణ బిల్లుకు సవరణలు తీసుకు వస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్‌ 'కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ ర్యాలీ'ని ఆదివారం నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గనేందుకే రాహుల్‌ 57 రోజుల సెలవుల అనంతరం ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Farmers  modi  congress  land pooling  

Other Articles