Uttamkumar | Mallubhativikramarka | Congress | Telangana

In telangana congress party cold war going between bhatti and uttamkumar

Mallubhatti vikramarka, Uttamkumar, congress, Telangana, pradesh congress, cold war, clasheshs

In telangana congress party cold war going between bhatti and uttamkumar. Telangana pradesh congress president uttam kumar, mallu bhatti vikramarka getting troubles to party in telangana.

కాంగ్రెస్ పార్టీలొ వర్గపోరు.. ఉత్తమ్ Vs భట్టి..?

Posted: 04/18/2015 07:53 AM IST
In telangana congress party cold war going between bhatti and uttamkumar

అసలే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయి. అంతోకొంతో ఉన్న తెలంగాణ ప్రాంతంలో మాత్రం నేతల మధ్య పోరు పార్టీకీ మరింత నష్టాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య అంతర్గతపోరు ప్రారంభమైందని తెలుస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నా పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు ఇద్దరు జొడెద్దులా పని చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆ పార్టీ నాయకులు ఆశించారు. పార్టీ పగ్గాలు చేపట్టిన కొత్త ఊపుతో వారు ఒకటి రెండు కార్య క్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. వారు ఇదే ఒరవడి కొనసాగిస్తారని భావిం చారు. గతంలో మాదిరిగా వీరిద్దరి మధ్య అంతర్గత పోరు కొనసాగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ బాధ్యతను తాను చూసుకుంటాను.. పార్టీ అను బంధ సంఘాల బాధ్యతను మీరు తీసు కోవాలని భట్టి విక్రమార్కకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త నిబంధన పెట్టినట్లు తెలిసింది. పార్టీలో ఇటువంటి సంప్రదాయం పార్టీలో లేదు. అనుబంధ సంఘాలను పార్టీ ప్రధాన కార్యదర్శులో లేదా ఉపాధ్యక్షులో పర్యవేక్షిస్తారు. పొన్నాల అధ్యక్షులుగా, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కార్యానిర్వాహక అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఇలాంటి అనవాయితీ కొనసాగింది.

ఏ సమావేశానికి వెళ్లినా, ఏ జిల్లాకు వెళ్లినా, చివరకు మీడియా సమావేశానికి సైతం ఇద్దరు కలిసి వెళ్లేవారు. పార్టీ పరిస్థితి, నాయకత్వంపై సంద్రింపులు కొనసాగేవి. కొత్త అధ్యక్షులు పార్టీ సమావేశాలకు వెళ్లి పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తూ...తనను పార్టీకి దూరం పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను అనుబంధ సంఘాలకు పరిమితం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో అనుబంధ సంఘాల బలోపేతం పార్టీకి పునాది లాంటిది. ప్రజాసంఘాలను బలోపేతం చేయడం ద్వారా అధ్యక్షుడికి పేరొస్తుంది. కష్టపడేది తానైతే ...పేరొచ్చేది ఆయనకా అని విక్రమార్క సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. పార్టీలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలపై ఆయన అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన మాట్లాడుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో కొంత విశ్వాసాన్ని పెంచుతోంది. మీడియా కవరేజ్‌ విషయంలోనూ వ్యత్యాసం కనిపిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలోనూ, అసెంబ్లీలోనూ మల్లు భట్టి విక్రమార్కకు ఇమేజ్‌ పెరుగుతుందన్న కారణంతో పిసిసి చీఫ్‌ ఇలాంటి నిబంధనలు పెట్టి తనను పార్టీకి దూరం చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallubhatti vikramarka  Uttamkumar  congress  Telangana  pradesh congress  cold war  clasheshs  

Other Articles