unanimous victory would increases maa prestige says nagababu

Naga babu on rajendra prasad victory

MAA Elections 2015 Results, Rajendra prasas womn maa elections, MAA Elections Live Updates, Inexplores: maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

unanimous victory of rajendra prasad would increases maa prestige says nagababu,

ఏకగ్రీవంగా ‘మా’ రాజు ఎన్నిక.. ప్రతిష్ట మరింత పెరిగేది నాగబాబు

Posted: 04/17/2015 01:18 PM IST
Naga babu on rajendra prasad victory

తెలుగు సినీ కళామా తల్లి కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. కళాకారుల కుటుంబాలకు మేలు చేయాలనే తపన అందిరిలొనూ వున్నా.. వాటికి బాధ్యతలను మాత్రం మంచి నేత చేతిలో వుంచడం మంచదన్న ఉద్దేశ్యంతోనే ప్రతీ పర్యాయం ఒకరికి పగ్గాలను అప్పజెబుతుంటామని అవే పగ్గాలు ఈ పర్యాయం ఉత్కంఠ పోరులో రాజేంద్రప్రసాద్ కు అందాయని మెగా బ్రదర్, మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు అన్నారు. అయితే మా అధ్యక్ష పదవికి నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు నాగబాబు తెలిపారు. అలా జరిగి వుంటే మా ప్రతిష్ట మరింత బలోపేతమయ్యేదని అయన అభిప్రాయపడ్డారు.

సహాజ నటి జయసుధకు తాము వ్యతిరేకం కాదని, ముందుగా రాజేంద్రప్రసాద్ ను బరిలో నిలుచుంటారని ప్రకటించారని, అందుచేతే ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని ఊహించామన్నారు. కాగా జయసుథ చివరి క్షణంలో బరిలోకి దిగడం ద్వారా ఓటింగ్ అనివార్యమయ్యిందని.. ఈ క్రమంలో నలుగురికి అందుబాటులో వుంటే వ్యక్తి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికైతే బాగుంటుందని తాము మద్దతు ప్రకటించామని, తమ ప్రతిపాదనకు మా కుటుంబ సభ్యులు కూడా అత్యధికంగా విశ్వసించి ఎన్నుకోవడం పట్టల ఆయన మా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మా ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించినట్లు నాగబాబు చెప్పారు. రాజేంద్రప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ.. చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు అన్నారు. మా సభ్యత్వ రుసుము తగ్గించాలని, ఇది చాలామందికి దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలుందని, ఎక్కువమంది సభ్యులు చేరేలా చూడాలని తెలిపారు. పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని, కనీసం 50-60 మంది వరకు ఇవ్వాలని అన్నారు. అలాగే మెడిక్లెయిమ్ సదుపాయం కూడా అవసరమని.. ఈ మూడూ తప్పనిసరిగా చేసి తీరాలని నాగబాబు ఆకాంక్షించారు. మా ఎన్నికల సందర్భంగా తొలి దశలో జరిగిన కొన్ని పరిణామాలు తమకు మనస్తాపం కలిగించినా, కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు తెలిపారు. అయితే ఈ పరిణామాలు మరో నటుడు ఓ కళ్యాణ్కు నచ్చకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్లారని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  movie arts association elections  naga babu  

Other Articles