Rahul | Media | Comments | Twitter

Twitter was abuzz with reactions following the development on rahul return

Rahul, comments, videos, tweets, rahul, congress, bjp, delhi, return

After an unexplained leave of nearly two months, Congress vice-president Rahul Gandhi returned from his sabbatical on Thursday. Twitter was abuzz with reactions following the development. Have a read.

ITEMVIDEOS:రాహుల్ రాకపై నెట్ లో కామెంట్ల వర్షం.. మీరూ చూడండి

Posted: 04/16/2015 03:17 PM IST
Twitter was abuzz with reactions following the development on rahul return

కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో రాహుల్ గాంధీ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. చాలా రోజుల తర్వాత తమ నేత తిరిగి రావడంపై కాంగ్రెస్ నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది. అందుకే కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి, ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి రావడంతో అన్ని మీడియా ఛానల్స్ లోనూ ఒక్కటే వార్త. రాహుల్ బాబు రిటర్న్స్ అని. మొత్తానికి జాతీయ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియాలోనూ రాహుల్ రాకపై వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాహుల్ రాకపై నెట్ లో రకరకాల కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు కూడా నెట్ లో తెగ సందడి చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ ఇన్ని రోజులు ఛాయ్ ఎలా చెయ్యాలో నేర్చుకునేందుకు వెళ్లారని, ఎందుకంటే ఛాయ్ చేసే వాళ్లు ప్రధానులు అవుతున్నారు కాబట్టి అని ఇలా రకరకాల కామెంట్లు నెట్ లో వస్తున్నాయి. ఇక మిషన్ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ముందుకు వస్తున్నారని, గత కొంత కాలంగా రాహుల్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి రిహెబిటేట్ సెంటర్ లో ఉన్నాడని రాశారు.

rahulcomments01

rahulcomments02

ఇక ఓ వీడియోలో అయితే బాబా టు బ్యాక్ అని రాహుల్ కార్టూన్ తో రకరకాల విన్యాసాలు చూపించారు. రాహుల్ ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్నలకు అందులో ఫన్నీ సమాధాలు చెప్పారు. ఎఐసిసి అంటే ఆల్ ఇండియా కామెడీ కమిటి అని కూడా కొత్త అర్థాన్నిచ్చారు. ఎఐసిసికి సమాధి కూడా కట్టేశారు.

పనిలో పనిగా మీడియా నూ వదల్లేదు. రాహుల్ రాక గురించి మీడియా ప్రతినిధులు మరీ ఎక్కువగా ఆరాటపడుతున్నారని కూడా కామెంట్ చేశారు. చాలా కాలం తర్వాత యజమానిని చూసిన కుక్క లాగా మీడియా వారు రాహుల్ వెంట పరుగులు పెడుతున్నారని కూడా మీడియాకు చురకలు పెట్టారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul  comments  videos  tweets  rahul  congress  bjp  delhi  return  

Other Articles