Manmohansingh | Telecom | Spectrum 2G | CBI

Ex telecom minister a raja had misled then pm manmohan singh on policy matters pertaining to 2g spectrum allocation

CBI, Manmohansingh, 2g, raja, kalimoni, manmohan, pm, upa,

In its final arguments in the 2G spectrum allocation case, the Central Bureau of Investigation (CBI) on Wednesday told the Special Court that ex-telecom minister A Raja had misled then PM Manmohan Singh on policy matters pertaining to 2G spectrum allocation.

రాజానే మన్మోహన్ సింగ్ ను తప్పుదోవపట్టించారు.. 2జి కేసులో సిబిఐ వాదన

Posted: 04/15/2015 12:47 PM IST
Ex telecom minister a raja had misled then pm manmohan singh on policy matters pertaining to 2g spectrum allocation

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జి కుంభకోణంలో మన్మోహన్ సింగ్ కు కాస్త బాసటగా సిబిఐ వాదించింది. యుపిఎ ప్రభుత్వంలో నాటి టెలికాం మంత్రిగా పనిచేసిన ఎ.రాజా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను తప్పదోవపట్టించారని సిబిఐ కోర్టుకు వివరించింది. స్పెక్ట్రమ్ కు సంబందించి రాజా మన్మోహన్ కు తప్పుడు వివరాలను వెల్లడించారని, ఫలితంగా కొన్ని అర్హత లేని కంపెనీలకు లాభాలు వచ్చాయని సిబిఐ వాదించింది. ఈ కేసులో ప్రభుత్వం దాదాపు31 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని కూడా సిబిఐ పేర్కొంది. స్వాన్ టెలికాం ప్రవేట్ లిమిటెడ్, యునిటెక్ వైర్ లెస్ లాంటి అర్హత కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినట్లు సిబిఐ కోర్టుకు వివరించింది.

నాటి ప్రధాని మన్మోహన్ తో పాటు టెలికాం మంత్రి ఎ.రాజా, కళిమొని, టెలికాం శాఖకు సంబందించిన కొందరు అధికారులు, స్పెక్ట్రమ్ లో పాల్గొన్న కొన్ని కంపెనీలకు చెందిన అధిపతులను సిబిఐ దర్యాప్తు చేసింది. 20102 లో2జి స్పెక్ట్రమ్ కు చెందిన 122 లైసెన్స్ లను అర్హత లేని కంపెనీలకు కేటాయించడం వల్ల దాదాపు 31 వేల కోట్ల రూపాయల నష్టం కలిగింది. ఈ కేసులో 154 సిబిఐ సాక్షులను విచారించింది. అందులో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, టీనా అంబానీ, నీరా రాడియా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే బొగ్గు కుంభకోణంలో సిబిఐ నుండి నోటీసులు అందుకున్న మన్మోహన్ సింగ్ తాజాగా స్పెక్ట్రమ్ కేసులో మాత్రం సిబిఐ కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  Manmohansingh  2g  raja  kalimoni  manmohan  pm  upa  

Other Articles